బాబు తీహార్ జైలుకెళ్లినా..విశాఖ లో రాజధాని తథ్యం !

Update: 2020-01-06 10:01 GMT
ప్రస్తుతం ఏపీ లో రాజధాని వ్యవహారం రోజురోజుకి ఇంకా ముదురుతూనే ఉంది. గత 20 రోజులుగా అమరావతి ప్రాంత ప్రజలు ..అమరావతిలోని రాజధానిని ఉంచాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికి ఈ నిర్ణయం పై ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు. ఇక అమరావతి రైతుల పోరాటానికి మద్దతు గా అవసరమైతే తాను ఏ జైలుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన పై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కౌంటర్ వేసాడు.

చంద్రబాబు తీహార్ జైలు కు వెళ్లినా సరే.. విశాఖపట్నంలో పరిపాలనాపరమైన రాజధాని ఏర్పాటై తీరుతుందని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా నిర్ణయాన్ని తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారని అన్నారు.తమ్మినేని సీతారాం సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పొందూరు లో గ్రామ సచివాలయ భవన నిర్మణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. విశాఖపట్నానికి పరిపాలనా రాజధాని రాకుండా ఆపడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు చూపుతోన్న ప్రేమ.. అమరావతి ప్రాంత రైతులపై కాదని ఆరోపించారు. రియల్టర్ల సంక్షేమం కోసమే చంద్రబాబు ఆలా రైతుల పై ప్రేమ ఉన్నట్టు నాటకం ఆడుతున్నాడు అని చెప్పారు.

అమరావతి లో ఇన సైడ్ ట్రేడింగ్ జరిగిందనే విషయం అందరికీ తెలుసునని, అందులో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ భూములను కొనుగోలు చేశారని విమర్శించారు. దీనితోనే అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారనే భయాందోళనలను చంద్రబాబు సృష్టిస్తున్నారని అన్నారు. అసలు అమరావతి నుండి రాజధానిని తరలిస్తారు అని ఎవరు చెప్పారని ..అమరావతి పాటుగా మరో రెండు నాగరాలని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం అని తెలిపారు . అలా చేస్తే మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని తమ్మినేని అన్నారు. అదే జరిగితే టీడీపీకి పుట్టగతులు ఉండవని, ఆ భయంతోనే చంద్రబాబు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.


Tags:    

Similar News