స్పుత్నిక్ వీ.. వ్యాక్సిన్ కు ఇప్పటివరకు వచ్చిన సైడ్ ఎఫెక్టులు ఎలాంటివి?
ప్రస్తుతం దేశంలో రెండు వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. సీరం సంస్థ కోవీ షీల్డ్.. భారత్ బయోటక్ వారి కొవాగ్జిన్. మరిన్ని టీకాలు ఉత్పత్తికి అవసరమైన ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో అత్యుత్తమ వ్యాక్సిన్లలో ఒకటిగా చెబుతున్న రష్యా డెవలప్ చేసిన స్పుత్నిక్ టీకాను అత్యవసర వినియోగానికి వీలుగా కేంద్రం అనుమతుల్ని మంజూరు చేసింది. దీంతో.. ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకు స్పుత్నిక్ కు ఉన్న తేడా ఏమిటి? ఈ వ్యాక్సిన్ సామర్థ్యం విషయానికి వస్తే 91.6 శాతంగా చెబుతారు.
ఈ టీకాను వాడిన వారిలో దుష్ప్రభావాలు చాలా అరుదుగా కనిపించినట్లుగా చెబుతారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కొద్దిమందిలో ఫ్లూ తరహా లక్షణాలు..ఇంజెక్షన్ చేయించుకున్న చోట నొప్పి.. కాస్త బలహీనంగా అనిపించటం లాంటి తాత్కాలిక లక్షణాలు కనిపించాయే తప్పించి..సీరియస్ సమస్యలేమీ ఇప్పటివరకు బయటకు రాలేదు. ఈ విషయాలన్ని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెట్ లో ప్రచురితమైంది.
ఇదిలా ఉంటే.. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చినా.. దాని ఉత్పత్తికి మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు. దేశీయంగా టీకా తయారీ అయ్యే వరకు రష్యా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఈ టీకా వచ్చే వరకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వద్ద ఉన్న నిల్వల్ని వినియోగిస్తారని చెబుతున్నారు. మరి.. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ధర మాటేమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
కొన్ని వర్గాల అంచనా ప్రకారం.. ఈ టీకా ధరను రూ.150గా ఫిక్స్ చేసే వీలుందని చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఈ టీకా ఒక్కో డోసు ధర రూ.500 వరకు ఉండొచ్చంటున్నారు. అయితే.. పలువురి అభిప్రాయం ప్రకారం రూ.150 - రూ.500 మధ్యలో ఉంటుందని.. మిగిలిన వ్యాక్సిన్ల కంటే దీని ధర ఎక్కువగా ఉండే అవకాశం లేదంటున్నారు. ఇక.. ఏడాదికి స్పుత్నిక్ వ్యాక్సిన్ ను 12.5 కోట్ల డోసుల్ని దిగుమతి చేసుకోవటానికి రెడ్డీ ల్యాబ్స్ కు అనుమతి ఉన్న విషయం తెలిసిందే.