చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు విజయాన్ని రుచి చూసింది. వరుసగా రెండు మ్యాచ్ ల ఓటమి అనంతరం సన్ రైజర్స్ ను ఓడించి గెలుపు బాట పట్టింది. ముందుగా బ్యాటింగ్ లో సత్తా చాటిన చెన్నై ఆ తర్వాత బౌలింగ్లోనూ రాణించి లక్ష్యాన్ని కాపాడుకుంది.20 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్ రేసు ఆశలను సజీవంగా ఉంచుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై ఆరు వికెట్లకు 167 పరుగులు చేసింది. మంచి ఫామ్ లో ఉన్న డుప్లెసిస్ గోల్డెన్ డక్ ఔట్ గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో ఓపెనర్‌గా కొత్త అవతారమెత్తిన సామ్ కరన్ (31; 21 బంతుల్లో, 3×3, 2×6) మెరిశాడు. షేన్ వాట్సన్ (42; 38 బంతుల్లో, 1×4, 3×6), అంబటి రాయుడు (41*, 34 బంతుల్లో, 3×4, 2×6) రాణించారు. ఈ జోడీ ముందు స్లోగా ఆడినా తర్వాత బౌండరీల మోత మోగిస్తూ మూడో వికెట్ కు 81 పరుగులు సాధించింది. ధోనీ (21; 13 బంతుల్లో, 2×4, 1×6), జడేజా (25*, 10 బంతుల్లో, 3×4, 1×6) మెరుపులు మెరిపించారు. దీంతో నిర్ణీత ఓవర్లలో చెన్నై 167 పరుగులు చేసింది.
అనంతరం ఛేదనలో హైదరాబాద్ జట్టు తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ జట్టులో విలియమ్సన్ (57; 39 బంతుల్లో, 7×4) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. వార్నర్ (9; 13 బంతుల్లో)ను సామ్ కరన్ ఔట్ చేయగా, మనీష్ పాండే (4; 3 బంతుల్లో, 1×4) రనౌటయ్యాడు. బెయిర్ స్టో (23; 24 బంతుల్లో, 2×4), ప్రియమ్ గార్గ్ (16; 18 బంతుల్లో, 1×4), విజయ్ శంకర్ (12; 7 బంతుల్లో, 1×6) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.
చివర్లో రషీద్ ఖాన్ (14; 7 బంతుల్లో, 1×4, 1×6) మెరిశాడు. అయినా రైజర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమై ఓటమి చెందింది.
ధోనీ ఫైర్.. మారిన అంపైర్ నిర్ణయం
ఛేదనలో సన్‌రైజర్స్ 11 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన సమయంలో 19 వ ఓవర్లో శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ వేసాడు. రెండో బంతిని అతడు వైడ్ యార్కర్‌గా వేయగా అంపైర్ వైడ్ గా ప్రకటించాడు. ఆ తరువాతి బంతిని ఠాకూర్ బ్యాట్స్‌మెన్‌కు అందకుండా వేయడానికి ప్రయత్నించాడు. అది కూడా వైడ్ యార్కర్‌గానే పడింది. క్రీజ్‌లో ఉన్న రషీద్ ఖాన్ దాన్ని అందుకోలేకపోయాడు.దీంతో స్టెయిట్ అంపైర్ పాల్ రీఫెల్ ఆ బంతిని కూడా వైడ్ గా ప్రకటించబోయాడు. రెండు చేతులను బార్లా చాపబోగా అదే సమయంలో ధోనీ గట్టిగా అరుస్తూ అది వైడ్ కాదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ధోనీ పిచ్ వద్దకు వచ్చి అది వైడ్ బాల్ కాదని ఠాకూర్ తో చెప్పాడు. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని వైడ్ ఇవ్వలేదు. అయితే ఆ బాల్ వైడ్ నని రీప్లే లో స్పష్టంగా కనిపించింది.