బ్రేకింగ్ : శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు

Update: 2019-04-22 10:37 GMT
శ్రీలంక దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస ఉగ్రవాద బాంబు పేలుళ్లతో ఆ దేశం అత్యవసర పరిస్థితిని విధించింది. ఇవాళ అర్థరాత్రి నుంచి ఆ దేశంలో ఎమెర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించి సంచలనం సృష్టించింది.

దేశం అంతర్గత భద్రత క్షీణించినప్పుడు ఇలా ఎమర్జెన్సీ విధించడం ఆనవాయితీ.. కానీ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దేశంలో ఉగ్రవాద బాంబు పేలుళ్లకు ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఈ పేలుళ్లలో సుమారు 295మంది మృత్యువాద పడ్డారు. 500మందికి పైగా గాయపడ్డారు.

ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకూ కర్ఫూను విధించింది శ్రీలంక ప్రభుత్వం. ఇప్పటికే బాంబు పేలుళ్లకు పాల్పడినట్టు అనుమానిస్తున్న ఉగ్రవాద సంస్థ సభ్యులను అరెస్ట్ చేశారు. ఇంకా అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాగా దేశంలో అత్యవసర పరిస్థితిపై కొద్దిసేపటి క్రితమే శ్రీలంక దేశాధ్యక్షుడు సిరిసేన కార్యాలయం మీడియాకు ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆ దేశంలోకి విమానంలో వెళ్లాలన్నా.. బయటకు దేశం విడిచి వెళ్లాలన్నా కష్టాలు తప్పవు. శ్రీలంకలో చిక్కుకుపోయిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. భారతీయులను ఇండియాకు తీసుకొచ్చేందుకు భారత్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Tags:    

Similar News