ప్రజల ఆందోళనకు పారిపోయిన దేశ అధ్యక్షుడు

Update: 2022-07-09 09:30 GMT
ఆర్థిక సంక్షోభంతో అట్టుడుకుతున్న శ్రీలంక మరోసారి రణరంగంగా మారింది. ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సే ఇంట్లోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. దీంతో శ్రీలంక సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించింది. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీఛార్జికి దిగింది సైన్యం. ఈ ఘటనలో 26మందికి తీవ్రగాయాలయ్యాయి. అలాగే నలుగురు జవాన్లకు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.

ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక ఇంకా కోలుకోవడం లేదు.  విదేశీ మారక ద్రవ్యం లేకపోవడంతో ఆ దేశ అవసరాలకు సరిపడే ఇంధనాన్ని కూడా అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కొన్ని రంగాలకు అస్సలు ఇంధనాన్ని కేటాయించడం లేదు. ఈ ఇంధన సంక్షోభ ప్రభావం ముఖ్యంగా విద్యావ్యవస్థపై పడింది. దీంతో జులై 4వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.

ఈ సెలవులు వారం రోజుల పాటు కొనసాగుతాయని శ్రీలంక విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఈ వారం రోజుల్లో పిల్లలు కోల్పోయిన సిలబస్ వచ్చే వారం క్లాసుల్లో కవర్ అవుతాయని పేర్కొన్నారు.

కాగా అంతకుముందు కూడా జూన్ 18వ తేదీన శ్రీలంక ప్రభుత్వం వారం రోజుల పాటు కొన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది.  ఆ సెలవులు ముగిసిపోయి ఇటీవలే పాఠశాలలను తెరిచారు. తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి నిర్ణయమే తీసుకోవాల్సి వచ్చింది.

శ్రీలంకకు 1948లో స్వతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి  ఉన్నత మధ్య ఆదాయ దేశంగా ఉన్న ఈ ద్వీప దేశం ఈ ఏడాది మార్చి నుంచి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతోంది. దీంతో ఆ దేశంలో ప్రజలు తీవ్రనిరసనలు తెలియజేస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. హింసకు రాజకీయ అశాంతి నెలకొంది. దీంతో అధ్యక్షుడు రాజపక్స సోదరుడు మహీందా రాజపక్స తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశాడు.  కొత్త ప్రధానిగా రణిల్ విక్రమ్ సింఘే నియమితులయ్యారు.

దిగుమతుల కోసం ప్రభుత్వం డాలర్లను కనుగోనలేకపోవడంతో శ్రీలంక ప్రజలు సుధీర్ఘ ఇంధనం, వంట గ్యాస్ క్యూలలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆర్థిక సంక్షోభంపై శ్రీలంక ప్రజలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ సంక్షోభం హింసాకాండకు దారితీసింది. ఒక ఎంపీ సహా 10 మంది మరణించారు. అధ్యక్షుడు రాజపక్సే కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రజాందోళనతో పారిపోయాడు.
Tags:    

Similar News