శ్రీరెడ్డి..తెలుగు సినిమా పరిశ్రమను ఓ కుదుపు కుదిపిన ఈ సినీ నటి గతంలో పవన్ ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. కొంతగ్యాప్ తర్వాత మళ్లీ పవన్ మీద ఆమె యుద్ధం ప్రకటించింది. నిన్ననే పవన్ కళ్యాణ్ తాను ఎక్కడ పోటీ చేసేదీ ఫిబ్రవరిలో వెల్లడిస్తాను అని ప్రకటించడంతో శ్రీరెడ్డి స్పందించింది. పవన్ ఎక్కడయినా పోటీ చేయనియ్యండి. అక్కడికి వెళ్తా. పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతాను. వదిలి పెట్టే ప్రసక్తే లేదు. అతన్ని ఓడించి నా శపథం నెరవేర్చుకుంటాను. బి రెడీ అంటూ తన అభిమానులను కలుపుకుని ఆమె ప్రకటించింది.
ఇటీవల కొంతకాలం ఆమె పవన్ పై ఏం కామెంట్లు చేయలేదు. కొందరు అయితే ఆమె ఇక టాలీవుడ్ ను వదిలేసినట్లే అనుకున్నారు. కానీ సమస్య లేదంటోంది ఆవిడ. మొత్తానికి జనసైనికులకు శ్రీరెడ్డి - కత్తి మహేష్ రూపంలో పెద్ద శక్తులు అడ్డుపడ్డట్లే ఉంది. ఇద్దరూ దేనికైనా రెడీ అన్నట్లు మాట్లాడటంతో జనసేన అభిమానులకు పాలుపోని పరిస్థితి. పైగా వీరిద్దరి వాగ్దాటిని ఎదుర్కొనే సరైన వ్యక్తి జనసేనలో ఇంతవరకు అయితే కనిపించలేదు. భవిష్యత్తులో వస్తారేమో!