‘తలైవి’ ని తలుచుకున్న స్టాలిన్​.. ఇదంతా పెద్ద స్కెచ్చా?

Update: 2021-03-21 14:30 GMT
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాట రాజకీయాలు హీట్​ ఎక్కాయి. అయితే ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శించడం ప్రతి ఎన్నికలో కామనే. కానీ ప్రత్యర్థులను పొగడటం అంటే అదే కొత్త ఎత్తుగడ. గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ‘జయలలిత’ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజులకే అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ‘అమ్మ’ మృతి చెందిన తర్వాత తమిళనాడు రాజకీయాలు ఎన్ని మలుపులు తిరిగాయో అందరికీ తెలిసిందే. అయితే జయలలిత మృతిపై గతంలోనే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈవివాదంపై డీఎంకే అధినేత, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి స్టాలిన్​ స్పందించారు. జయలలిత మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. అంతేకాక జయలలిత చాలా గొప్ప నేత అంటూ కొనియాడారు.

ఎన్నికల టైంలో అన్నాడీఎంకే నేతలు సైతం జయలలిత గురించి పెద్దగా మాట్లాడటం లేదు. ఆమె ఫొటోలు పెట్టుకొని మాత్రం తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే సడెన్​గా స్టాలిన్​ కొత్త రాగం అందుకున్నారు.

ఆయన ఆదివారం కన్యాకుమారిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘  జయలలిత నాకు రాజకీయ ప్రత్యర్థి కావచ్చు. కానీ ఆమె ఎంతో గొప్ప వ్యక్తి. ధీర వనిత. ఆమె మరణం నన్ను ఎంతో కలిచివేసింది. అంతేకాక ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.జయలలితకు తమిళనాట ఎంత క్రేజ్​ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆమె చాలా ఏళ్లు తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత కరుణానిధిని ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు స్టాలిన్​ ఆమె పేరు తలుచుకోవడం వ్యూహాత్మకమేనని విశ్లేషకులు  భావిస్తున్నారు.

 స్టాలిన్​ ఎంతో వ్యూహాత్మకంగా కీలకటైంలో జయలలిత పేరును ప్రస్తావించారని .. తద్వారా ఆయనకు ఎంతో కొంత లబ్ధి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

నీట్, సీఐఐకి వ్యతిరేకంగా ఎన్నో సందర్భాల్లో మాట్లాడారని స్టాలిన్ పేర్కొన్నారు. అన్నాడీఎంకే నేతలు ఆమె ఆశయాలను తుంగలో తొక్కారని స్టాలిన్​ విమర్శించారు. ఆమె చలువతో ముఖ్యమంత్రులు, మంత్రులైన కొందరు నేతలు ఆమెలక్ష్యాలను తుంగలో తొక్కి.. స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నారని మండిపడ్డారు.
Tags:    

Similar News