శబరిమల ఆలయంలో తొక్కిసలాటు చోటు చేసుకుంది. ఆదివారం చోటు చేసుకున్న ఈ తొక్కిసలాటలో దాదాపు 17 మందికి పైగా గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉందని చెబుతున్నారు. శబరిమల ఆలయంలో స్వామి వారి దర్శనం తర్వాత.. మాలికాపు రత్తమ్మ ఆలయం వద్దకుభక్తులు చేరుకుంటారు. ఈ ఆలయం వద్ద పెద్ద ఎత్తున రద్దీ నెలకొని ఉంటుంది. అయితే.. అమ్మవారిని దర్శనం తొందరగా పూర్తి చేసుకోవాలన్న అతృత కనిపిస్తుంటుంది.
ఆదివారం సాయంత్రం ఇలాంటి దృశ్యమే చోటు చేసుకుంది. ఈ ఉదంతంల మొత్తం 17 మందికి గాయాలు అయినట్లుగా చెబుతున్నారు. తొక్కిసలాటకు గురైన ప్రజల్లో ఎక్కువ మంది ఏపీకి చెందిన వారేనని చెబుతున్నారు. బాధితుల్లో ఎక్కువమంది అనంతపురం..గుంటూరు జిల్లాలకు చెందినవారిగా చెబుతున్నారు. తాజా తొక్కిసలాట ఘటనపై కేరళ ప్రభుత్వం స్పందించింది. తొక్కిసలాట ఏర్పడటానికి చోటు చేసుకున్న కారణాల్ని అన్వేషించేందుకు ఒక కమిటీ వేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రమాదంలో గాయపడిన వారికి అందుతున్న సహాయక చర్యల గురించి ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా..మెరుగైన వైద్యం కోసం గాయపడిన వారిని ఏపీకి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యల్ని తీసుకోవాలని.. ఏర్పాట్లు చేయాలని చినరాజప్ప అధికారుల్ని ఆదేశించారు. ఇప్పటికైనా ఆలయానికి వచ్చే రద్దీ.. తొక్కిసలాటగా మారకుండా ఏం చేయాలన్న అంశం మీద తగ్గించేలా కేరళ ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పకతప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/