మీడియా ముందు స్మిత్ భావోద్వేగం!

Update: 2018-03-29 12:02 GMT
ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన టెస్టు మ్యాచ్ లో బాల్ టాంపరింగ్ ఉదంతం నేప‌థ్యంలో ఆస్ట్రేలియా జ‌ట్టు కెప్టెన్ స్మిత్ - వైస్ కెప్టెన్ వార్న‌ర్ ల పై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఏడాదిపాటు నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. ఆ మ్యాచ్ సంద‌ర్భంగా మైదానంలో టాంప‌రింగ్ కు పాల్ప‌డ్డ బాన్ క్రాఫ్ట్ పై 9 నెల‌ల నిషేధం విధించారు. ఈ నేప‌థ్యంలో స్వదేశానికి చేరుకున్న స్మిత్ మీడియా సమావేశం నిర్వ‌హించాడు. ఈ సంద‌ర్భంగా స్మిత్...తాను చేసిన త‌ప్పుకు క్ష‌మాప‌ణ‌లు చెబుతూ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. తీవ్ర భావోద్వేగంతో మాట్లాడిన స్మిత్....అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఆ వ్య‌వ‌హారంలో తాను ఎవరినీ నిందించడం లేదని, కెప్టెన్ గా ఆ రోజు మైదానంలో జ‌రిగిన పరిణామాలకు త‌న‌దే పూర్తి బాధ్యత అని స్మిత్ వాపోయాడు. ఓ జ‌ట్టు సార‌థిగా తాను పూర్తిగా విఫలమ‌య్యాన‌ని స్మిత్ కంట‌త‌డిపెట్టాడు.

త‌న తండ్రితో క‌లిసి మీడియా స‌మావేశానికి వ‌చ్చిన స్మిత్ భావోద్వేగంతో  మీడియాతో మాట్లాడాడు. తాను పూర్తిగా నాశమయ్యాన‌ని, ఆ నిర్ణయం తీసుకొని తాను చాలా పెద్ద త‌ప్పు చేశాన‌ని మ‌ద‌న‌ప‌డ్డాడు. అంతేకాకుండా, ఆ త‌ప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేసి మ‌రింత న‌ష్ట‌పోయాన‌ని, ఆ తప్పు త‌న‌ను జీవితాంతం వెంటాడుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. తాను చేసిన పొర‌పాటును ఇంకెవ‌రూ చేయొద్ద‌ని - త‌న జీవితం ఇతరులకు గుణపాఠం కావాల‌ని అన్నాడు. త‌న ఉదంతం....క్రీడా వ్యవస్థలో మార్పును తీసుకురావాల‌ని ఆశిస్తున్నాన‌ని స్మిత్ అన్నాడు. ప్ర‌స్తుతం త‌న త‌ల్లితండ్రుల మొహం చూడ‌డానికి కూడా ఇబ్బందిగా ఉంద‌ని, మంచి వ్య‌క్తులు త‌ప్పులు చేస్తుంటార‌ని, కానీ తాను చాలా పెద్ద త‌ప్పు చేశాన‌ని స్మిత్ అంగీక‌రించాడు. క్రికెట్ త‌న‌ జీవితం అని - మళ్లీ మైదానంలో అడుగుపెట్టేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తాన‌ని అన్నాడు.

విమానాశ్ర‌యంలో స్మిత్ కు ఘోర అవ‌మానం

కాగా, స్వ‌దేశానికి బ‌యలుదేర‌డానికి జొహన్నెస్‌ బర్గ్ విమానాశ్ర‌యానికి వ‌చ్చిన స్మిత్ కు ఘోర అవమానం జ‌రిగింది. ఎయిర్ పోర్ట్ లో స్మిత్ తో భద్రతాధికారులు అవ‌మాన‌క‌ర రీతిలో వ్యవహరించ‌డం వివాదాస్ప‌ద‌మైంది. స్మిత్ చేతులు పట్టుకుని భద్రతా సిబ్బంది లాక్కెళుతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీంతో, భ‌ద్ర‌తాధికారుల తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. స్మిత్ క్రిమినల్ కాదని - అతడిని నేర‌స్థుడిలా చేతులు పట్టుకుని లాక్కెళ్ల‌డం ఏమిట‌ని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ మండిప‌డ్డాడు. స్మిత్ - వార్న‌ర్ ల‌పై ఏడాది నిషేధం విధించ‌డం స‌రికాద‌ని ఆసీస్ మాజీ స్మిన్ దిగ్గజం షేన్ వార్న్ అన్నాడు. వారిది త‌ప్పేన‌ని, వారికి కఠిన శిక్షలు పడాల్సిందేనని...కానీ, ఆ శిక్ష‌లు వారి కెరీర్ ను నాశనం చేయ‌కూడ‌ద‌ని అన్నాడు.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News