ఏపీలో కఠిన కరోనా ఆంక్షలు.. హైకోర్టు కీలక ఆదేశాలు

Update: 2022-01-11 10:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. కోవిడ్ వ్యాప్తి నివారణ చర్యలు కఠినతరం చేసింది. అంతేకాదు ఏపీలో నైట్ కర్ఫ్యూను విధించింది. తాజాగా నైట్ కర్ఫ్యూ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈనెలాఖరు వరకూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిత్యావసర వస్తువులు, వైద్యచికిత్స వంటి అత్యవసర సర్వీసులకు మినహాయింపునిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి, ఇండోర్ లో 100 మందికి మాత్రమే అనుమతిచ్చింది. సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని అంతర్రాష్ట్ర రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.

ఇక సినిమా థియేటర్లలో సీటుకు మధ్య గ్యాప్ ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. 50 శాతం ఆక్యూపెన్సీతో సినిమా థియేటర్లలో సినిమాలను ప్రదర్శించుకోవడానికి అనుమతినిచ్చింది. ప్రజా రవాణాలో ప్రయాణికులు, సిబ్బందికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించింది.

షాపింగ్ మాల్స్, దుకాణాల్లోకి వినియోగదారుడు తప్పనిసరిగా మాస్క్ ధరించి వెళ్లాలని తెలిపింది. ఒకవేళ మాస్క్ ధరించని వినియోగదారుడిని షాపుల్లోకి అనుమతినిచ్చే ఆ షాప్ నిర్వాహకులపై గరిష్టంగా 25 వేల జరిమానా విధించనున్నారని తెలిపింది.

-ఏపీలో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా హైకోర్టు కీలక ఆదేశాలు..

కొంతకాలంగా ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాలు క్రమంగా ఆంక్షలు పెడుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కూడా తాజాగా కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక ఏపీ హైకోర్టు కూడా తాజాగా కరోనా కేసుల దృష్ట్యా కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసులను వర్చువల్ విధానంలో విచారించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత నుంచి అంటే ఈనెల 17వ తేదీ నుంచి వర్చువల్ విధానంలోనే కేసుల విచారణ చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ఇక కోర్టుల్లో ఆన్ లైన్ విధానంలోనే విచారణ కొనసాగనుంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఉధృతరూపం దాల్చిన సమయంలోనూ ఆన్ లైన్ లోనే కేసుల విచారణను కొనసాగించనుంది.
Tags:    

Similar News