వైఎస్ ష‌ర్మిల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇవ్వ‌బోతున్నారా?

Update: 2021-07-27 10:30 GMT
తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం స్థాపిస్తానంటూ.. రాజ‌కీయ పార్టీ పెట్టిన వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌య‌.. ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి.. వైఎస్ ష‌ర్మిల వ్య‌వ‌హారం పై నెటిజ‌న్లు.. కౌంట‌ర్లు ఇస్తున్నారు. ఆమె తెలంగాణ ప్ర‌భుత్వం పై తీవ్ర‌స్థాయిలో దూకుడుగా ఉన్న విష‌యం తెలిసిందే. నిరుద్యోగుల‌ను మోసం చేశార‌ని.. ఉద్యోగ క‌ల్ప‌న లో పార‌ద‌ర్శ‌కత లేద‌ని.. ష‌ర్మిల విమ‌ర్శిస్తున్నారు. అదేస‌మ‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఏర్ప‌డిన జ‌ల వివాదాల విష‌యంలో తెలంగాణ‌ సీఎం కేసీఆర్ ఉద్దేశ పూర్వ‌కంగానే.. రాజకీయాలు చేస్తున్నార‌ని కూడా ఆమె విమ‌ర్శించారు.

అయితే.. ఇప్పుడు ఇవే అంశాల‌ను టార్గెట్ చేస్తూ.. ష‌ర్మిల‌కు కౌంట‌ర్ ఇస్తున్నారు సోష‌ల్ మీడియా నెటిజన్లు. ``ఏపీలో మీ అన్న‌గారి పాల‌న చూడండి.. అక్క‌డ ఎలాంటి మార్పులు తీసుకురావాలో తీసుకురండి.. త‌ర్వాత‌.. తెలంగాణ స‌ర్కారు పై ఊరేగండి!`` అంటూ.. ఒకింత వ్యంగ్యంగానే ష‌ర్మిల‌ను టార్గెట్ చేస్తున్నా రు. అయితే.. ఆమె ఉన్న‌ది తెలంగాణ‌, పార్టీ పెట్టింది తెలంగాణ‌లో క‌దా.. ఏపీలో ఏం జ‌రిగితే.. ఆమె కెందుకు అంటారేమో.. ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు ఏర్ప‌డ‌డంలో ష‌ర్మిల కీల‌క పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే.

ఎన్నిక‌ల‌కు ముందు.. త‌ర్వాత‌.. ఎన్నిక‌ల స‌మయంలోనూ.. ఆమె ఏపీ వ్యాప్తంగా తిరిగి.. జ‌గ‌న‌న్న బాణాన్ని! అని ప‌రిచ‌యం చేసుకుని ముందుకు సాగారు. ఈ క్ర‌మంలో ఏపీలో జ‌గ‌న్‌ స‌ర్కారు ఏర్పాటుకు ష‌ర్మిల కూడా ఒక కార‌ణం. సో.. ఆమె తెలంగాణ‌లో ఏ స‌మ‌స్య‌పై అయితే.. గ‌ళం విప్పుతారో.. అదేస‌మ‌యంలో ఏపీలో అదే స‌మ‌స్య‌పై ఎలాంటి విధానం అనుస‌రిస్తున్నార‌నే విష‌యంపై ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ముందు అన్న‌గారిని స‌రిచేయండి! అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

తెలంగాణ‌లో ఉద్యోగాల‌పై ష‌ర్మిల ఒక రోజు దీక్ష చేశారు. అయితే.. ఈ విష‌యంపై నెటిజ‌న్లు స్పందిస్తూ.. ఏపీలో ఎన్నిక‌ల‌కు ముందు దాదాపు 2.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాన‌ని జ‌గ‌న్ నిరుద్యోగు ల‌కు హామీ ఇచ్చారు. కానీ, ఇటీవల ప్ర‌క‌టించిన జాబ్ క్యాలెండ‌ర్‌లో కేవ‌లం 10 వేల పోస్టుల‌ను మాత్ర‌మే పేర్కొన్నారు.  తెలంగాణలో మాత్రం 50 వేల పోస్టుల భర్తీకి కసరత్తు మొదలయింది. సో.. ముందు ఏపీలో ఉద్యోగాల భర్తీకి అన్నను డిమాండ్ చేయాలని షర్మిలపై సోషల్ మీడియాలో ట్రోల్ మొదలయింది.  

ఇక‌, న‌దీ జ‌లాల విష‌యంలో తెలంగాణ ప్ర‌జ‌లు, రైతులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న సీమ ఎత్తిపోత‌ల‌ను ఆపేలా .. అన్న‌య్య‌తో చ‌ర్చ‌లు జ‌రపొచ్చుక‌దా! అనే వ్యాఖ్య‌లు ఇప్పుడు ష‌ర్మిల‌కు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ష‌ర్మిల చేస్తున్న వ్యాఖ్య‌లకు, నిర‌స‌న‌ల‌కు.. ప్ర‌జ‌లు, నెటిజ‌న్లు బాగానే కౌంట‌ర్లు ఇస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News