రాష్ట్రప‌తి పాల‌న పెట్ట‌మంటున్న స్వామి

Update: 2016-10-07 09:54 GMT
సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు.. వివాదాస్ప‌ద ట్వీట్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన బీజేపీ సీనియ‌ర్‌ నేత‌.. రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య ఒక‌టి చేశారు. గ‌డిచిన రెండు వారాలుగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత తీవ్ర అనారోగ్యానికి గురై.. చెన్నై అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో ఆమె ఎప్ప‌టికి కోలుకుంటారో కూడా తెలీని ప‌రిస్థితి. అపోలో ఆసుప‌త్రి వ‌ర్గాలే.. ఆమె పూర్తిస్థాయిలో కోలుకోవ‌టానికి వారాల స‌మ‌యం ప‌డుతుంద‌ని చెబుతున్నారు. అది నెల‌ల కూడా ప‌ట్టినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న వాద‌న ప‌లువురు లోగుట్టుగా చెబుతున్న మాట‌.

ఇదిలా ఉంటే.. జ‌య‌ల‌లిత ఆరోగ్యం స‌రిగా లేని నేప‌థ్యంలో.. త‌మిళ‌నాడు రాష్ట్రంలో రాష్ట్రప‌తి పాల‌న విధించాల‌ని సుబ్ర‌మ‌ణ్య స్వామి డిమాండ్ చేస్తున్నారు. సీఎం జ‌య‌ల‌లిత అనారోగ్యంతో విధులు నిర్వ‌హించ‌లేక‌పోతున్న నేప‌థ్యంలో.. పాల‌న కుంటుప‌డుతోంద‌ని.. ఆమె కోలుకునే వ‌ర‌కూ తాత్కాలికంగా రాష్ట్రప‌తిపాల‌న విధించాల‌ని కేంద్ర‌మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరారు.

త‌మిళ‌నాడులోని కొన్ని జిల్లాల్లో ఐసిస్ స్లీపింగ్ సెల్స్ ఉన్నాయ‌ని.. అవి ఏ రోజైనా విద్వంసం సృష్టించే అవ‌కాశం ఉంద‌ని.. ఈ నేప‌థ్యంలో రాష్ట్రప‌తి పాల‌న అవ‌స‌ర‌మ‌న్న‌ది స్వామి డిమాండ్ గా ఉంది. భ‌విష్యత్తులో జ‌య అవ‌స‌రం ఎంతో ఉన్న వేళ‌.. రాష్ట్రప‌తి పాల‌న విధించి అన్నాడీఎంకేతో సున్నం పెట్టుకునేందుకు మోడీ స‌ర్కారు సుముఖంగా ఉండే అవ‌కాశం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి.. సొంత పార్టీ స‌భ్యుడు చేసిన విన‌తిపై రాజ్ నాథ్ ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News