రాజకీయాల్లో భావోద్వేగానికి ఉండే ప్రాధాన్యత ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అధికార బలానికి.. భావోద్వేగానికి మధ్య ఎన్నికల సమరం షురూ అయ్యింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో పాలేరు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉమ్మడి రాష్ట్రంలో అనుసరించిన సంప్రదాయానికి బిన్నంగా.. ఏకగ్రీవం వద్దంటూ ఎన్నికల పోటీకి దిగుతున్న వైనం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ అధికారపక్షం అధికార బలాన్ని నమ్ముకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దింపేందుకు డిసైడ్ అయ్యింది.
ఆయనకు పోటీగా దించేందుకు సమాలోచనలు జరిపిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితను అభ్యర్థిగా ఖరారు చేసింది. తమ నిర్ణయాన్ని అధినాయకత్వానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పంపింది. అధికారబలాన్ని భావోద్వేగంతో దెబ్బ తీయాలని భావిస్తున్న కాంగ్రెస్.. ఇందులో భాగంగా మిగిలిన రాజకీయ పక్షాల్ని జట్టుగా చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రాయబారాల్ని షురూ చేసింది.
కాగా.. కాంగ్రెస్ పార్టీకి కోరిన విధంగా సుచరితకు మద్దుతు పలకటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓకే చెప్పగా.. తెలుగుదేశం తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. పవర్ కు..ఎమోషన్ కు మధ్య పోరాటంగా మారిన పాలేరు ఉప ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.