మూడు నెలల్లో ఏపీలో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లకోసం పాలక టీడీపీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే టీడీపీ కోటాలో వెంకయ్యనాయుడు - యనమల రామకృష్ణుడు - లోకేశ్ ల పేర్లు వినిపిస్తుండగా ఇప్పుడు మరో బలమైన పేరు వినిపిస్తోంది. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడైన కంభంపాటి రామ్మోహనరావు కూడా రాజ్యసభ సీటు కోసం ట్రై చేస్తున్నారు. అయితే... కంభంపాటి రాజ్యసభ రేసులోకి రావడంతో కేంద్ర మంత్రి సుజనాచౌదరి తన అవకాశాలకు గండిపడుతోందని భయపడుతూ కంభంపాటితో కటీఫ్ చెప్పేశారట.
ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహన్ రావు రాజ్యసభ కలలు కంటున్నారు. కానీ సుజనా చౌదరి మరో ఛాన్స్ కోసం బాబును ప్రతి రోజు బతిమిలాడుతున్నారట. కేంద్ర మంత్రి పదవి రాక రాక వచ్చింది. టర్మ్ అయిపోయే వరకు ఉండనివ్వాలని చెబుతున్నారట. మరోవైపు కంభంపాటి కూడా ప్రతిసారీ నాకు సారీ అనేస్తున్నారు.. ఈసారైనా అవకాశమివ్వండంటూ చంద్రబాబుపై ప్రెజర్ పెంచుతున్నారట. దీంతో సుజనా - కంభంపాటి మధ్య రాజ్యసభ సీటు ఏకంగా చిచ్చు పెట్టేసిందట. వారిద్దరూ ఇప్పుడు ఎదురెదురు పడినా కూడా మాట్లాడుకోవడం లేదని తెలుస్తోంది.