ఆర్కే బీచ్ వేదికగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఏపీలోని యువత గళం విప్పుతుంటే టీడీపీ ఎంపీ - కేంద్ర మంత్రి సుజనా చౌదరి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. జల్లికట్టు స్పూర్తితో ప్రత్యేక హోదా కోసం ఆర్కే బీచ్ వేదికగా ఏకమవుతున్నామని చెప్తున్న వారు జల్లికట్టు రూపంలోనే పందాలు ఆడుకోవాలని ఎద్దేవా చేశారు. కోడిపందాలు - అవసరమైతే పందుల పందాలు సైతం ఆడుకోవచ్చని సుజనా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా విద్యార్థులను - యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుండటం వల్లే ఇలాంటి నిరసనలు, ఆందోళనల గళం తెరమీదకు వస్తోందని సుజనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు ఏ విషయంలో అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని సుజనా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ అన్యాయం జరిగితే ఏపీ సీఎం చంద్రబాబు చూస్తూ ఊరుకోరని సుజనా వ్యాఖ్యానించారు. అన్యాయం జరిగిందని వ్యాఖ్యలు చేస్తున్న వారి దగ్గర వివరాలు ఉంటే వెల్లడించాలని సుజనా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశమని స్పష్టం చేసిన సుజనా చౌదరి ఈ విషయం కాకుండా ఏపీని ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకుపోవాలో ఆలోచించాలని కోరారు.
ఇదిలాఉండగా... ఆర్కే బీచ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నారు. ప్రత్యేక హోదా పోరాటానికి యువత తలపెట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన సినీ హీరో సంపూర్ణేష్ బాబు ముందుగా ప్రకటించినట్లుగానే విశాఖకు వెళ్లారు. అక్కడ్నుంచి ఆర్కే బీచ్ కు వెళుతున్న సమయంలో పోలీసులు సంపూను అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి తరలించారు. కాగా హోదాకు మద్దతిస్తుంటే అరెస్ట్ చేయడంపై స్పందన తెలపాలంటూ కోరగా సంపూ విముఖత వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/