తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీల మధ్యన బంధం గురించి కొత్తగా వివరించనక్కర్లేదు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ రెండు పార్టీలూ దోస్తీ చేశాయి. రాష్ట్రాన్ని దారుణంగా మోసం చేశాయి. ప్రత్యేకహోదా వంటి కీలకమైన అంశంలో మోడీ సర్కారు ఏపీకి తీరని అన్యాయం చేసింది. హోదా ఇస్తామని - తమకు అధికారం ఇస్తే చాలని చెప్పిన మోడీ.. తీరా అధికారం అందాకా మాత్రం మోసపూరిత వైఖరిని అవలంభించాడు. ఆ వైఖరికి చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు వత్తాసు పలికాడు. హోదా వద్దు అని చంద్రబాబు నాయుడు వాదించాడు. హోదా అని ఎవరైనా అంటే వారిని జైలుకు పంపుతానని హెచ్చరించాడు.
ఆ తర్వాత ఏమో స్కెచ్ మార్చి.. తామిద్దరం వేరైనట్టుగా అగుపిస్తూ ప్రజలను మోసం చేయడానికి కొత్త వ్యూహంతో ఈ ఇరు పార్టీలూ ముందుకు వెళ్తున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు ఎప్పటికీ మిత్రుడే అని స్వయంగా కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ - రాజ్ నాథ్ సింగ్ లు స్పష్టం చేస్తున్నారు. ఈ విధంగా తెలుగుదేశం - బీజేపీల మధ్యన బంధం కొనసాగుతూ ఉంది.
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీ ఎంపీలు భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలతో తరచూ టచ్ లోనే ఉన్నారనేది. ప్రత్యేకించి తెలుగుదేశం ఎంపీ సుజనాచౌదరి బీజేపీ నేతలతో మొదటి నుంచి టచ్ లోనే ఉన్నాడు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చాకా... తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనాచౌదరి పలు సార్లు బీజేపీ నేతలను కలుస్తూనే ఉన్నాడు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా చెప్పారు. తెలుగుదేశం మీటింగులోనే ఈ చర్చ జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు దాన్ని కవర్ చేశాడు.
ఈ నేపథ్యంలో ఇటీవల సుజనాచౌదరి మరోసారి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశం జరిగిన వెంటనే వైఎస్ జగన్ భార్య భారతి పేరును చార్జిషీట్ లో పెట్టాలని అంటూ ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ప్రజల్లో వైఎస్ జగన్ ఇమేజ్ పెరుగుతుండటంతో.. పాదయాత్రతో జగన్ దూసుకుపోతూ ఉండటంతో.. ఏదో విధంగా జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు జగన్ ఇంట్లో వాళ్లను కూడా రచ్చలోకి తెస్తున్నారని సమాచారం. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యూహం రచిస్తుంటే.. బీజేపీ అమలు చేస్తున్నట్టుగా తెులస్తోంది. మరి వీళ్ల గేమ్ ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.