వైసీపీ కార్యకర్తను చితకబాదిన సీఐ.. పరామర్శపై సూళ్లూరిపేట ఎమ్మెల్యే సీరియస్
ప్రత్యర్థి పార్టీల వారు చేసే తప్పుడు ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేయటం ఇప్పుడు రాజకీయాల్లో కామన్ అయిపోయింది. మొన్నటివరకు ఉన్న మీడియాకు బదులుగా.. సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్లో చెలరేగిపోతున్న వారిని కంట్రోల్ చేయటం నాయకులకు తలనొప్పిగా మారింది. ఊరంతా ఒక దారి అయితే.. అన్న సామెతకు తగ్గట్లు.. ఏపీలోని మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా సూళ్లూరుపేటలో చోటు చేసుకున్న పరిణామం అధికార పార్టీలో ఇప్పుడు చర్చగా మారింది.
సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు కోపం వచ్చింది. సొంత పార్టీ నేతలపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తనపై వాట్సాప్ లో మెసేజ్ లు పెడితే ఖండించాల్సింది పోయి.. సదరు వ్యక్తికి ఎలా మద్దతు ఇస్తారంటూ తోటి వైసీపీనేతలపై ఆయన సీరియస్ అవుతున్నాయి. అయితే.. సదరు వ్యక్తి వైసీపీ కార్యకర్త కావటంతో.. సూళ్లూరిపేట రాజకీయం ఇప్పుడు మరింత రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతల నడుమ వాగ్వాదం చోటు చేసుకోవటం గమనార్హం.
వైసీపీ సానుభూతిపరుడైన బాబురెడ్డి అలియాస్ జ్యోతిష్ కుమార్ రెడ్డి సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయంలో కాంటాక్టుపద్దతిలో పని చేస్తున్నాడు. ఇటీవల అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో.. ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వైసీపీ ప్రభుత్వ తీరును తప్పు పడుతూ ఒక మెసేజ్ ను వాట్సాప్ లో పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో సూళ్లూరుపేట సర్కిల్ ఇన్ స్పెక్టర్, ఎస్ ఐలు అతన్ని స్టేషన్ కు పిలిపించారు. అనంతరం అతడు బయటకు రాగా.. ఒళ్లంతా గాయాలున్నాయి.. తనను పోలీసులు కొట్టారంటూ బాధితుడు బాబు రెడ్డి ఆరోపించారు.
ఈ సందర్భంగా తన ఒంటి మీద ఉన్న గాయాలకు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేశాడు. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో.. స్థానిక వైసీపీ నేతలు అతన్ని చెంగాళమ్మ టెంపుల్ వద్దకు పిలిపించి.. అసలేం జరిగిందన్న విషయాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేశారు. అతడు చెప్పిన వివరాల్ని విన్న అనంతరం.. సీఐకి ఫోన్ చేసిన వైసీపీ నేతలు.. అధికారపార్టీకి సానుభూతి పరుడైన వ్యక్తిని అంతలా ఎలా కొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది జరిగిన కాసేపటికే.. ఈ నేతల వద్దకు వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే సంజీవయ్య.. వైసీపీ నేతలపై మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా వాట్సాప్ మెసేజ్ పెట్టిన బాబురెడ్డికి మద్దతుగా ఎలా నిలుస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ''నాపై పోస్టులు పెట్టినోడ్ని ఎలా సమర్థిస్తారు? అతడికి ఉద్యోగం ఇప్పించిందే నేను'' అని ఫైర్ అయ్యారు.
ఇక్కడో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బాధితుడ్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి కుమారుడు కమ్ వైసీపీ సోషల్ మీడయా సలహాదారు భార్గవ్ రెడ్డి.. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఫోన్ లో పరామర్శించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే వెర్షన్ ఒకలా ఉంటే.. బాబురెడ్డి ఉదంతంపై వైసీపీ అగ్రనేతలు మరోలా రియాక్టు కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. సంజీవయ్య ఉదంతంలో రానున్న రోజుల్లో ఏం జరగనుందన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.