ఏడు దశాబ్దాలు బ్రిటన్ ను పాలించిన రాణి ఎలిజబెత్ 2 మరణం.. రాజకుటుంబంలో మరిన్ని ఇబ్బందికర పరిస్థితులకు తెర తీసినట్లుగా చెబుతున్నారు. ఆమె అంత్యక్రియల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో రాకుమారుల్లో ఒకరైన హ్యారీకి దారుణ అవమానం జరిగినట్లుగా పేర్కొంటూ ప్రముఖ మీడియా సంస్థ 'సండే టైమ్స్' సంచలన కథనాన్ని పబ్లిష్ చేసింది. ఏదో గాలి మూట కట్టినట్లు కాకుండా.. తాను చెప్పే విషయాలకు తగిన ఆధారాలు చూపిస్తూ కథనాన్ని ఇవ్వటంతో ఇప్పుడీ స్టోరీ హాట్ టాపిక్ గా మారింది.
క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియ సందర్భంగా హ్యారీకి దారుణ అవమానం ఎదురైందని.. దీంతో అతడు తీవ్రమైన విచారంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. శనివారం రాత్రి క్వీన్ ఎలిజబెత్ 2 భౌతికకాయాన్ని సందర్శించేందుకు ఆమె మనవలు.. మనవరాళ్లు ప్రత్యేకంగా సందర్శించి నివాళులు అర్పించారు. విలియంతో పాటు హ్యారీ కూడా ప్రిన్స్ చార్లెస్ 3 ప్రత్యేక అనుమతితో సైనిక దుస్తుల్ని ధరించారు. ఈ సందర్భంగా హ్యారీకి ఇచ్చిన దుస్తులకు రాణి అధికారిక చిహ్నమైన 'ఈఆర్'ను తొలగించటం.. ఏ మాత్రం అర్హత లేని వారి దుస్తులపై 'ఈఆర్' చిహ్నం ఉండటం హ్యారీని బాధించినట్లుగా చెబుతున్నారు.
తండ్రితోనూ.. సోదరుడు విలియన్స్ తోనూ సత్ సంబంధాలు లేని హ్యారీ రాచకుటుంబం అభ్యంతరాల్ని కాదని అమెరికన్ నటి మెగన్ మార్కెల్ ను పెళ్లాడిన వైనంతో ఈ ఇష్యూ మరింత ముదిరిన సంగతి తెలిసిందే.
నిజానికి హ్యారీ దంపతులు తమ రాచరిక హోదాను వదులుకొని.. అమెరికాకు వెళ్లిపోవటం తెలిసిందే. నాయనమ్మ అంత్యక్రియల సందర్భంగా ప్రత్యేక అనుమతితో సైనిక దుస్తులు ధరిస్తే.. దారుణమైన అవమానం జరిగిందని వాపోయినట్లుగా చెబుతున్నారు. ఇదంతా కావాలనే.. ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా హ్యారీ భావిస్తున్నారు.
దీనికి కారణం లేకపోలేదంటూ.. సైనిక దుస్తుల్ని ధరించే అర్హత లేని ఎలిజబెత్ 2 కొడుకు ప్రిన్స్ ఆండ్రూ ధరించిన సైనిక దుస్తుల మీద కూడా 'ఈఆర్' చిహ్నాన్ని యథాతథంగా కొనసాగించి.. తన దుస్తులపై మాత్రం ఆ చిహ్నం లేకుండా చేయటాన్ని ఎత్తి చూపినట్లుగా తెలుస్తోంది.
తను ధరించిన దుస్తుల మీదనే ఈఆర్ చిహ్నం తొలగించటం హ్యారీకి మరింత మనస్తాపాన్ని కలిగించినట్లుగా సండే టైమ్స్ కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈ ఇష్యూలో హ్యారీని టార్గెట్ చేసినట్లుగా చెప్పే వాదనకు బలం చేకూరుస్తూ.. ఆదివారం రాత్రి బకింగ్ హాం ప్యాలెస్ లో దేశాధినేతలకు చార్లెస్ 3 ఇచ్చిన అధికారిక విందు కార్యక్రమానికి హ్యారీ దంపతుల్ని దూరంగా ఉంచినట్లుగా చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.