ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వై.సునీల్ యాదవ్ (ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (ఏ3), దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (ఏ5) బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే నిందితుల తరఫు వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ సీబీఐ, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఈ నేపథ్యంలో సునీత న్యాయస్థానానికి హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ మీద ఉన్నారు. నిందితుల నుంచి వాంగ్మూలాలు సేకరించారని.. వారికి ఎటువంటి ప్రాణహాని లేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అందువల్ల నిందితులకు బెయిల్ ఇవ్వాలని ఇప్పటికే కోర్టును కోరారు.
గత సోమవారం శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ప్రారంభం కాగానే సునీత తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తమ వాదనలూ వినాలని అనుబంధ పిటిషన్ (ఇంప్లీడ్) దాఖలు చేశామని తెలిపారు.
మృతుడి కుమార్తెగా ఆమె ఇంప్లీడ్ అయ్యేందుకు అర్హత ఉందని చెప్పారు. గతంలో శివశంకర్‌రెడ్డి పిటిషన్‌ను ఓ న్యాయమూర్తి కొట్టేశారని, ప్రస్తుత వ్యాజ్యం అక్కడికే విచారణకు వెళ్లాలని కోర్టు దృష్టికి తెచ్చిన విషయం తెలిసిందే.
వివేకా హత్య కేసులో నిందితుల స్టేట్ మెంట్స్‌ను సీబీఐ కోర్టు ముందు ఉంచింది. నిందితులు ఇచ్చిన వాంగ్మూలంలో అనేక సంచలన అంశాలు వెలుగు లోకి వచ్చాయి.
దస్తగిరితో సహా.. వివేకాతో సంబంధాలు ఉన్న పలువురిని సీబీఐ విచారించి..వారి నుంచి వాంగ్మూలాలు సేకరించింది. హత్య జరిగిన రోజున పులివెందులలోని వివేకా నివాసంలో చోటు చేసుకున్న పరిణామాలు...వివేకా మరణం పైన తొలుత గుండెపోటుగా జరిగిన ప్రచారం మొదలు..పలు కోణాల్లో పలువురి నుంచి సీబీఐ సమాచారం సేకరించింది.