బ్రేకింగ్: టీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి సునీత

Update: 2019-04-01 12:30 GMT
ఇప్పటికే నేతల వలసలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ.. మెదక్ జిల్లాలో బలమైన నేతగా ఉండి.. వైఎస్ హయాంలో మంత్రిగా చేసిన మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సునీతా లక్ష్మీరెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ - మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో సోమవారం ఆమె టీఆర్ఎస్ లో చేరారు.

సోమవారం మెదక్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారానికి వచ్చారు. వెంట హరీష్ రావు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పని తెలంగాణ ఖతమైందని సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పై ఆ పార్టీ నేతలకే విశ్వాసం లేకుండా పోయిందని సునీతా చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదన్నారు. నర్సాపురం నియోజకవర్గంలో ప్రతి ఏకరానికి సాగునీరు అందించాల్సిన అవసరం ఉందని.. అందుకే టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు తెలిపారు..

కాగా మాజీ మంత్రి, సీనియర్ నేతను టీఆర్ఎస్ లో చేర్చుకున్న కేటీఆర్ ఆమెకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

సునీత చేరికతో మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కుదేలైంది. ఇప్పటికే రోకలి పోటులా మారిన పార్టీకి ఆమె నిష్క్రమణతో జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే జగ్గారెడ్డియే కాంగ్రెస్ కు దిక్కుగా మారారు.

Tags:    

Similar News