అయోధ్య వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు విషయంలో రివ్యూ ఉంటుందా? ఉండదా? అనేది ఇంకా మిస్టరీగానే మిగిలింది. ఆ స్థలం హిందువులకే చెందుతుందంటూ సుప్రీం ధర్మాసనం తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీర్పుపై ముస్లిం వర్గాలు కొంత వరకూ నిరాశ పడ్డాయి.
అలాంటి వారు ఇంకా చట్టపరంగా పోరాటం చేయడానికి అవకాశం ఉంది. రివ్యూ పిటిషన్ ను దాఖలు చేసి..సమీక్ష కోరే అవకాశం ఉండనే ఉంది. అయితే ధర్మాసనం తీర్పుపై రివ్యూకు వెళ్లేదీ లేనిదీ ఇంకా ప్రకటన రాలేదు.
ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇన్నేళ్లూ పోరాడిన సున్నీ వక్ఫ్ బోర్డు స్పందించింది. ఈ నెల పదిహేడున ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సమావేశం జరుగుతుందని, ఆ రోజున ఈ అంశంపై చర్చించబోతున్నట్టుగా ఈ కేసులో సున్నీ వక్ఫ్ బోర్డ్ తరఫున వాదించిన లాయర్ జిలానీ ప్రకటించారు.
రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలా, ధర్మాసనం ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ కామ్ అయిపోవాలా..అనే అంశం గురించి ఆ రోజున డిసైడ్ చేయబోతున్నట్టుగా ఆయన తెలిపారు.
ఒకవేళ ధర్మాసనం తీర్పుపై వక్ఫ్ బోర్డు రివ్యూ పిటిషన్ దాఖలు చేసినా, దాన్ని విచారణకు తీసుకుంటారా? అనేది కూడా స్పష్టత లేని అంశమే. ఇప్పటికే సుదీర్ఘ విచారణ జరిగిన నేపథ్యంలో, మళ్లీ రివ్యూ అవసరమా అనేది కూడా ప్రశ్నార్థకమే!