ముస్లిం పర్సనల్ లా బోర్డు సంచలన నిర్ణయం

Update: 2019-11-27 10:57 GMT
అయోధ్యలోని వివాదాస్పద భూమికి సంబంధించి సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సంచలన నిర్ణయాన్ని తీసుకుంది ముస్లిం పర్సనల్ లా బోర్డు. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని పేర్కొంది. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కును వినియోగించుకోనున్నట్లు పేర్కొంది.

మరోవైపు మంగళవారం ఇదే కేసుపై సుప్రీం వెలువరించిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని తాము అనుకోవటం లేదని.. ఈ కేసులో కీలక భాగస్వామ్యమున్న సున్నీ వక్ఫ్ బోర్డు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. అయితే.. రివ్యూ కోరకూడదంటూ సున్నీ వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో తమ కేసుకు చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొంది.

డిసెంబరు మొదటివారంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది. యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు ప్రకటించిన దాని ప్రకారం సుప్రీం కేటాయించిన ఐదు ఎకరాల భూమిని స్వీకరించాలా? వద్దా? అన్న దానిపై తాము తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పి.. రివ్యూ పిటిషన్ కు మాత్రం వెళ్లనంది. ఇలాంటివేళ.. పర్సనల్ లా బోర్డు మాత్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని డిసైడ్ చేయటం సంచలనంగా మారింది.
Tags:    

Similar News