ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా నిర్ధారించిన కోర్టు.. ప్రశాంత్ భూషణ్ ను కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా ప్రకటించింది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. ట్విట్టర్ వేదికగా ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి, అంతకుముందు సీజేఐలుగా ఉన్న మరో నలుగురి గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని అభిప్రాయపడిన కోర్టు .. . ఇవి కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని స్పష్టం చేస్తూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దోషిగా తేల్చింది.
అయితే , న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు శిక్షపై ఈ నెల 20న వాదనలు వింటామని తెలిపింది. అయితే, వ్యక్తిగత స్వేచ్ఛను వినియోగించుకుని, కోర్టు పనితీరు గురించి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను, అంతే తప్ప నేను కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడలేదని ప్రశాంత్ భూషణ్ తన వాదన వినిపించారు. ఆగస్టు 3న దాఖలుచేసిన అఫిడవిట్‌లో తాను ట్వీట్ చేసిన వాటిలో కొంత భాగాన్ని మాత్రమే చింతిస్తున్నానని, ఉన్నతాధికారిపై విమర్శలు న్యాయస్థానం ప్రతిష్ఠకు భంగం కలిగించవని, దాని అధికారాన్ని తగ్గించవని ప్రశాంత్ భూషణ్ తెలిపారు.
ఈయన గతంలో కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సంచలన ఆరోపణలు చేశారు. 2009 లో ఓ ఇంటర్వ్యూ లో సుప్రీంకోర్టులోని 16 మంది న్యాయమూర్తులు అవినీతిపరులేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టారు. ఈ కేసులో ప్రశాంత్ భూషణ్ క్షమాపణల చెప్తున్నటుగా కోర్టుకి తెలుపగా .. సుప్రీం కోర్టు అయన క్షమాపణలని తిరస్కరించింది. అలాగే ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయా లేదా అన్నది పరిశీలించనున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.ఈ అంశంపై ప్రశాంత్ భూషణ్ క్షమాపణలు చెప్పారు. ‘16 మంది ప్రధాన న్యాయమూర్తులు అవినీతిపరులంటూ నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరు ఇబ్బందిపడ్డా.. వారి కుటుంబ సభ్యులకు బాధ కలిగినా అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను’ అంటూ ప్రశాంత్ భూషణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.