హైకోర్టు విభజన.. సుప్రీంకోర్టు తాజా తీర్పు

Update: 2018-11-05 11:46 GMT
తెలంగాణ ఏర్పడి ఇప్పటికీ నాలుగున్నరేళ్లు అయ్యింది. అన్నింటిని విభజించినా ఉమ్మడి హైకోర్టును మాత్రం విభజించలేకపోయారు. ఇందుకు ఎన్నో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు హైకోర్టు విభజన కాకుండా అడ్డుకొని తమపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో సార్లు విమర్శించారు. తాజాగా ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మౌలిక వసతులకు సిద్ధమైతే ఏపీ - తెలంగాణ హైకోర్టుల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని జస్టిస్ ఏకే సిక్రీ - జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

వచ్చే ఏడాది జనవరి వరకు నోటిఫికేషన్ జారీ చేస్తామని.. అనంతరం ఏపీ - తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా విధులు నిర్వహించడం ప్రారంభమవుతుందని సుప్రీం కోర్టు తెలిపింది. 

అయితే ఏపీ హైకోర్టు కొత్త భవనం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని.. ఈ ఏడాది డిసెంబర్ 15 నాటికి తాత్కాలిక భవనాలు సిద్ధమవుతాయని ఏపీ ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. అమరావతిలో జస్టిస్ సిటీ పేరుతో పెద్ద కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని.. అందులోనే హైకోర్టు - సబార్డినేట్ కోర్టు - జడ్జీల వసతి సదుపాయాలు - నివాస గృహాలు ఏర్పాటు చేస్తామని సుప్రీంకు ఏపీ నివేదించింది. అప్పటివరకూ తాత్కాలిక భవనాల్లో హైకోర్టు కొనసాగుతుందని తెలిపింది. దీంతో పూర్తయిన వెంటనే నివేదిక ఇస్తే హైకోర్టు విభజనకు నోటిఫికేషన్ ఇస్తామని సుప్రీం ఉత్తర్వులు ఇచ్చింది. .
Tags:    

Similar News