తాజాగా ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికైన ఎమ్మెల్యేల్లో దాదాపు 70శాతం మందిపై నేరచరిత్ర ఉందని.. ఏదో ఒక కేసు నమోదై ఉందని ఓ సంస్థ దారుణమైన నిజాలన వెల్లడించింది. అయితే నేరం చేసిన వారు రాజకీయాల్లోనే ఉండొద్దు అని నినదించే రోజులు పోయాయి.. నేతలు నేరాలు చేస్తూనే ఉంటారు. మనం వారిని గెలిపిస్తూనే ఉంటాం..అయితే సుప్రీం కోర్టు ఊరుకోదుగా.. అందుకే వారి బండారాన్ని బయటపెట్టాలని ఆదేశించి దేశంలోని రాజకీయ నేతలకు షాకిచ్చింది.
రాజకీయ నాయకుల నేరచరితపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ నాయకులపై ఉన్న క్రిమినల్ కేసులను రాజకీయ పార్టీలన్నీ తమ అధికారిక వెబ్ సైట్ లో పొందుపర్చాలని పార్టీలకు సూచించింది. నాయకులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిసినా వారికి ఎందుకు టికెట్లు ఇస్తున్నారని సుప్రీం కోర్టు పార్టీలను ప్రశ్నించాయి. రాజకీయాలు నేరాలతో ముడిపడి ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాజకీయ నాయకుల నేర చరితపై సుప్రీం కోసం సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఆదేశాలు దేశంలోని నేతల గుండెల్లో గుబులు రేపేలా ఉన్నాయి.
ఇకపై నేరచరిత కలిగిన నాయకులు, వారిపై ఉన్న క్రిమినల్ కేసులను వారి పేర్లతో సహా పార్టీ అధికారిక వెబ్ సైట్ తోపాటు సోషల్ మీడియాలోనూ 48 గంటల్లో పొందుపర్చాలని సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.72 గంటల్లోగా నేతల నేరచరితను ఎన్నికల సంఘానికి సమర్పించాలని గడువు విధించింది.
ఇక ఒకవేళ తమ ఆదేశాలను నేతలు పాటించక పోయినా.. ఎన్నికల సంఘం అమలు చేయకపోయినా కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని హెచ్చరించింది. తీవ్రవైన నేరాలకు పాల్పడిన వారిని ఎన్నికల్లో నిషేధించాలన్న పిటీషన్ పై విచారణలో భాగంగా సుప్రీం కోర్టు ఈ సంచలన ఆదేశాలు జారీ చేసింది.