దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కీలక అంశంపై పునరాలోచన మొదలైంది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటూ 2013లో ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉండాలా? లేదా దాన్ని సవరించాలా అనే అంశంపై సుప్రీంకోర్టు ఆలోచనలో పడింది. స్వలింగ సంపర్కానికి వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. ఈ కేసును వాయిదా వేయాలన్న కేంద్రం పిటిషన్‌ను సోమవారం తిరస్కరించిన కోర్టు.. విచారణకు నూతనంగా ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 377 రాజ్యాంగ విర్ధుమైనదని.. ఒకే లింగానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే శృంగారం తప్పు కాదని 2009లో ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకోని సుప్రీంకోర్టు 2013లో ఏక లింగ శృంగారం నేరమేనని నిర్ధారించింది. అప్పటినుంచి అసహజ లైంగిక చర్యను పోలీసులు నేరంగా గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. ఐపీసీ సెక్షన్ 377 రాజ్యాంగ ప్రామాణికతను - ఎల్ జీబీటీక్యూ (లెస్బియన్స్ - గే - బైసెక్సువల్ - ట్రాన్స్‌జెండర్స్ - క్వీర్) వర్గాల ప్రాథమిక హక్కులను సంపూర్ణంగా పరిశీలిస్తామని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా లైంగిక సంబంధాన్ని కలిగి ఉండటాన్ని సెక్షన్ 377 నేరంగా పేర్కొంటున్నది. పురుషుడు - స్త్రీ లేదా జంతువులతో ప్రకృతికి విరుద్ధంగా శారీరక సంబంధం కలిగి ఉన్నట్టు నిర్ధారణ అయితే దోషులకు జీవితఖైదు - జరిమానా విధిస్తారు.
ఈ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒకే లింగానికి చెందిన ఇద్దరు మేజర్ల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక చర్యను ఐపీసీలోని సెక్షన్ 377 నేరంగా పేర్కొంటోంది. ఈ సెక్షన్ ను పిటిషనర్లు వ్యతిరేకిస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఈ బెంచ్ లో జస్టిస్ లు ఆర్ ఎఫ్ నారిమన్ - ఏఎం ఖాన్విల్కర్ - డీవై చంద్రచూడ్ - ఇందు మల్హోత్రా ఉన్నారు. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా మాట్లాడుతూ 2013లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షిస్తామని పేర్కొన్నారు.