ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు శిక్ష.. జరిమానా ఎంతంటే?

Update: 2022-07-11 06:54 GMT
బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని 2017లో విదేశాలకు పారిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్కా ప్రస్తుతం లండన్ లో ప్రవాస ఆశ్రయం పొందుతున్నాడు. భారత ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా కోర్టులకు ఎక్కి అక్కడి ప్రభుత్వాలతో మేనేజ్ చేస్తూ ఇండియాకు రాకుండా అడ్డుకోగలుగుతున్నారు. దేశం దాటిన దోపిడీదారులను రప్పించడంలో మోడీ సర్కార్ ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్థుడు, లిక్కర్ బరూన్ విజయ్ మాల్యాకు దేశ అత్యున్నత న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. కోర్టు ధిక్కరణ కేసు విషయంలో శిక్ష విధించింది. ఈ మేరకు  కొద్దిసేపటి కిందటే సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. 2017లో చోటుచేసుకున్న ఈ ఘటనలో విజయ్ మాల్యా, కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లు ధృవీకరించింది. ఈ కేసులో శిక్షను ఖరారు చేసింది.

తాజాగా విజయ్ మాల్యాకు నాలుగు నెలల కారాగార శిక్ష, 2వేల రూపాయల జరిమానా విధించింది సుప్రీంకోర్టు. అలాగే 40 మిలియన్ డాలర్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. వడ్డీతో కలిపి ఈ 40 మిలియన్ డాలర్ల మొత్తాన్ని డిపాజిట్ చేయాలని సూచించింది. నిర్ధేశించిన గడువులోగా ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే ఆయన ఆస్తులను అటాచ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ దిశగా దర్యాప్తు ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

2017 మే 9వ తేదీన విజయ్ మాల్యా తన పిల్లల అకౌంట్ కు 40 మిలియన్ డాలర్లను బదిలీ చేశారు. తన ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించకుండానే ఈ మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేశారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

విజయ్ మాల్యా కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు పిటీషన్ దాఖలు కావడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పటికే తన విచారణను పూర్తి చేసింది. వాదోపవాదాలను ఆలకించింది. అనంతరం శిక్షను మార్చి 10వ తేదిన తన తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సుప్రీంకోర్టు విజయ్ మాల్యాకు విధించాల్సిన శిక్షను ఖరారు చేసింది. తుదీ తీర్పును వినిపించింది.

బ్యాంకులకు 9500 కోట్లు ఎగ్గొట్టి విజయ్ మాల్యా ఏడేళ్ల కిందట దేశం విడిచి పారిపోయాడు. ఆయన లండన్ లో నివసిస్తున్నారు. ఆయనను రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలు ప్రయత్నాలు చేశాయి. అవేవీ కార్యరూపం దాల్చలేదు.
Tags:    

Similar News