ఇప్పటికి ఎనిమిదేళ్ళ క్రితం ఉమ్మడి ఏపీగా ఉంటూ రెండు రాష్ట్రాలుగా ఆంధ్రా తెలంగాణా విడిపోయాయి. నాడు రూపొందించిన విభజన చట్టం ప్రకారం ఏపీలో ఉన్న 175 సీట్లకు గానూ 225, అలాగే తెలంగాణాలో ప్రస్తుతం ఉన్న 119 సీట్లకు గానూ 153 సీట్లకు పెంచాలి. అయితే దీని మీద కేంద్రం ఇన్నేళ్ళుగా ఉదాశీనంగా ఉండడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ లో సీట్లను మాత్రం డీ లిమిటేషన్ కమిటీ వేసి మరీ పెంచింది.
ఇది రాజ్యాంగం ప్రకారం వివక్ష అంటూ అసలు ఏపీ తెలంగాణాలకు ఎందుకు సీట్లు పెంచలేదని, విభజన చట్టం ఎందుకు అమలు చేయలేదని పేర్కొంటూ పురుషొత్తం రెడ్డి అనే ఆయన సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్రా తెలంగాణా రాష్త్ర ప్రభుత్వాలకు దీనికి సంబంధించి నోటీసులను జారీ చేసింది.
ఈ కేసుని ఈ నెల 29న తిరిగి విచారిస్తారు. ఇదిలా ఉంటే కొన్ని కచ్చితమైన పాయింట్లతో ఈ పిటిషన్ని వేశారు. అందులో జమ్మూ కాశ్మీర్ లో ఒక విధానం, ఏపీ తెలంగాణాలలో మరో న్యాయం ఏంటి అన్నది చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎనిమిదేళ్లు పూర్తి అయినా అసెంబ్లీ సీట్లు ఎందుకు పెంచడం లేదు అన్నది మరో పాయింట్. ఇక చూస్తే కేంద్రం ఇక్కడ చెబుతోంది ఏంటి అంటే 2031 నాటి జనాభా లెక్కల ప్రకారం సీట్ల పెంపు ఉంటుందని. మరి అదే నిబంధనలు జమ్మూ కాశ్మీర్ కి ఎందుకు వర్తిమచేయడంలేదు అన్నది కీలకమైన ప్రశ్న.
చేస్తే అందరికీ 2031 నాటి జనాభా లెక్కలనే తీసుకుని చేయాలి. కానీ అక్కడ అలా ఇక్కడ ఇలా చేయడం తగునా అన్నదే చర్చ. దీని మీద సుప్రీం కోర్టు పూర్తి విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇస్తే కనుక ఏపీ తెలంగాణాలలో కూడా డీ లిమిటేషన్ కమిటీలను వేసి కేంద్రం సీట్లు పెంచక తప్పని పరిస్థితి. మొత్తానికి కోర్టు ద్వారా సానుకూలమైన తీర్పు వస్తుందని అంతా భావిస్తున్నారు. సీట్ల పెంపు మీద రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా ఉన్నాయి.
తెలంగాణాలో 2023 చివరలో ఎన్నికలు ఉంటే ఏపీకి 2024 మేలో ఎన్నికలు ఉన్నాయి. మరి డీ లిమిటేషన్ కమిటీ వేసి దాని నివేదిక ప్రకారం సీట్లు పెంచేందుకు ఈ సమయం సరిపోతుందా లేదా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ లేదు అన్నది నిజం. సో సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్రం అడుగులు వేసి నిర్ణీత గడువులోగా డీ లిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తే వచ్చే ఎన్నికల్లో పెంచిన సీట్లలోనే పోటీ రసవత్తరంగా మారే అవకాశాలు ఉంటాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.