అమెరికా వీసా ఇప్పించిన‌ చిన్న‌మ్మ‌

Update: 2018-01-06 09:54 GMT
స‌రైన కార‌ణంతో త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ఎవ‌రికైనా సాయం చేసేందుకు ఏ మాత్రం వెనుకాడ‌ని వారిలో కేంద్ర‌మంత్రి సుష్మాస్వ‌రాజ్ ముందుంటారు. ట్వీట్ సందేశం ఇచ్చినా వెంట‌నే స్పందించే ఆమె.. ఈ మ‌ధ్య‌న ఒక యువ‌తి అమెరికా క‌ల‌ను తీరుస్తాన‌ని మాట ఇవ్వ‌ట‌మే కాదు.. దాన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసిన వైనంపై ఇప్పుడామెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఒక గ్రామీణ టీనేజ‌ర్ కు అమెరికాలో ఉన్న‌త‌విద్య‌ను అభ్య‌సించాల‌న్న కోర్కెను తీర్చ‌టంలో కీల‌క‌భూమిక పోషించారు సుష్మా.

జ‌ల‌ల్ పూర్ గ్రామానికి చెందిన  భానుప్రియ హ‌రిట్ వాల్ 2015లో టెన్త్ క్లాస్ స్టేట్ ర్యాంక్ సాధించారు. ఆమె తండ్రి ఒక ప్రైవేటు స్కూల్లో టీచ‌ర్ గా ప‌ని చేస్తుంటారు. హిందీ మీడియంలో స్టేట్ ర్యాంక్ సాధించిన భానుమ‌తితో స‌హా  ముగ్గురు విద్యార్థుల‌కు రాజ‌స్థాన్ స్టేట్ స‌ర్కార్ రూ.కోటి స్కాల‌ర్ షిప్‌ను ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల ప్ల‌స్ టూ పూర్తి చేసిన భానుమ‌తికి ఉన్న‌త విద్య కోసం కాలిఫోర్నియా స్టేట్ యూనివ‌ర్సిటీలో కంప్యూట‌ర్ సైన్స్ విద్య‌ను చేయాల‌నుకుంది.

ఇందుకు సంబంధించి ప్ర‌వేశ ప‌రీక్ష్ల‌లో ఉత్తీర్ణ‌త సాధించింది. స్కాల‌ర్ షిప్ అర్హ‌త సాధించిన భానుప్రియ‌ రెండుసార్లు  ప్ర‌య‌త్నించినా యూఎస్ వీసా ల‌భించ‌లేదు. దీంతో.. త‌న క‌ల‌ను సాధించుకోవ‌టానికి ఆమె  త‌న తండ్రితో క‌లిసి సిక‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఎంపీ స్వామి సుమేధానంద్‌ ను సంప్ర‌దించారు.

ఈ టీనేజ‌ర్‌ ఉదంతం గురించి విన్న ఆయ‌న కేంద్ర‌మంత్రి సుష్మా స్వ‌రాజ్ ను క‌లిశారు.  భానుమ‌తి ఉదంతాన్ని చిన్న‌మ్మ దృష్టికి తీసుకెళ్లారు. ప్ర‌తిభ ఉన్న భానుప్రియ‌ను ప్రోత్సాహించాల‌న్న ఉద్దేశంతో ఆమె అమెరికా రాయ‌బార కార్యాల‌యాన్ని సంప్ర‌దించారు. సుష్మా స్వ‌రాజ్ ఫోన్లో మాట్లాడిన నేప‌థ్యంలో ఎంబ‌సీ అధికారులు వీసా మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. చిన్న‌మ్మ పుణ్య‌మా అని త‌న అమెరికా చ‌దువు క‌ల నెర‌వేరినందుకు భానుప్రియ తో పాటు ఆమె కుటుంబ స‌భ్యులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.ఎక్క‌డో రాజ‌స్థాన్ లోని ఒక గ్రామీణ విద్యార్థిని క‌ల‌ను నెర‌వేర్చేందుకు చిన్న‌మ్మ ప‌డిన త‌ప‌న ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.
Tags:    

Similar News