అనేక కీలక మలుపులు తిరుగుతున్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో తాజా సాక్షి రంగయ్య అలియాస్ రంగన్న చెప్పిన మాటలపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం రంగన్న జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వివేకా హత్యకు సంబంధించి సాక్ష్యం చెప్పారు. దాదాపు గంటన్నరపాటు రంగన్న చెప్పిన విషయాలను జడ్జి బాబా ఫకృద్దీన్ నమోదు చేసుకున్నారు. అంటే సాక్ష్యం మొత్తం ఇన్ కెమెరా పద్దతిలో జరిగిందని అర్ధమవుతోంది.
సాక్ష్యం నమోదైపోయిన తర్వాత మీడియాలో ఒక్కసారిగా వచ్చిన విషయాలు సంచలనంగా మారింది. వివేకా హత్యకు రు. 8 కోట్లు సుపారి ఇచ్చారని, హత్యలో ఎనిమిది మంది పాల్గొన్నారని, ఐదుగురు ఇంట్లోకి వెళ్ళారంటు శుక్రవారం మధ్యాహ్నం నుండి మీడియా ఒకటే ఊదరగొట్టింది. అయితే ఇదంతా తప్పేని అర్ధమవుతోంది. ఎందుకంటే సాక్ష్యం చెప్పిన రంగన్న తప్ప విచారణ గదిలో ఇంకెవ్వరు లేరు. సిబీఐ అధికారులు వివరాలు చెప్పలేదు. జడ్జీ చెప్పలేదు. రంగన్న కూడా నోరిప్పలేదు.
విచారణలో రంగన్న ఏమి చెప్పారో తెలీకపోయినా మీడియా బ్రేకింగ్ న్యూస్ అంటూ ఎలా హడావుడి చేసిందో అర్ధం కావటంలేదు. సాయంత్రం సీబీఐ అధికారులు రంగన్నను బస్టాండ్ దగ్గర వదిలిపెట్టేశారు. అప్పటికే రంగన్నను విచారించారనే విషయం మీడియాలో పదే పదే రావటంతో సాక్షిని గుర్తించిన స్ధానికులు చుట్టుముట్టారు. రంగన్నను చుట్టుముట్టిన వారిలో స్ధానిక మీడియా కూడా ఉంది. కోర్టులో తానిచ్చిన సాక్ష్యంపై పదే పదే అడిగినా రంగన్న నోరిప్పలేదు.
చివరకు బాగా ఒత్తిడి పెట్టిన తర్వాత ఎవరి చెవిలోనో ఎర్ర గంగిరెడ్డి, వివేకాకు ఒకుపుడు డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి, సునీల్ కుమార్ పేర్లను చెప్పారట. అంతమంది ఉన్నపుడు ఎవరిచెవిలోనో మూడు పేర్లు చెప్పటం ఏమిటో అర్ధం కావటంలేదు. విచారణ గురించి చెప్పమని ఒత్తిడి చేసినపుడు కోర్టులో తాను ఏమి సాక్ష్యం ఇచ్చానో గుర్తులేదని స్పష్టంగా రంగన్నే చెప్పారట. సీబీఐ విచారణలో ఏమి చెప్పాడో ? కోర్టులో ఏమి చెప్పాడో ఎవరికీ తెలీదు. బస్టాండ్ దగ్గర జనాల చెవిలో మూడు పేర్లు చెప్పింది నిజమేనా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.