జగన్ కు మద్దతుగా దర్శకుడు - నిర్మాత!

Update: 2019-04-01 01:30 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా గళం విప్పారు సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి, ఆయన స్నేహితుడు కమ్ ప్రొడ్యూసర్ అచ్చి రెడ్డి.  అన్నింటా కలిసి కనిపించే ఈ స్నేహితులు జంటగా జగన్ తరఫున మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి చేయగలిగిందే  చెబుతారని అంటూ వీరు ఎన్నికల వేళ జగన్ కు మద్దతుగా మాట్లాడారు. ప్రజల కోసం జగన్ మోహన్ రెడ్డి పడుతున్న తపన తమను కదిలించిందని, పాదయాత్ర ద్వారా జగన్ ప్రజలను అర్థం చేసుకున్నారని వారు కితాబిచ్చారు.

జగన్ ను చూస్తుంటే వైఎస్సార్ గుర్తుకు వస్తున్నారని - దివంగత వైఎస్ ఆర్ కూడా ప్రజల కోసం ఇలా తపించారని - ఆయనలానే జగన్ ఆలోచనలున్నాయని అన్నారు. జగన్ ప్రకటించిన నవరత్నాలు పథకాలను కూడా ఎస్వీకే - అచ్చిరెడ్డి ప్రశంసించారు. అవి అమల్లోకి వస్తే పేదలకు ఎంతగానే ఉపయోగపడతాయన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజల భవిష్యత్ బాగుటుందన్నారు.

ఇక తెలంగాణలో సీమాంధ్రులపై దాడులు జరుగుతున్నాయన్న వ్యాఖ్యలను ఖండించారు అచ్చి రెడ్డి. హైదరాబాద్ లో తామంతా సంతోషంగా ఉన్నామని, రాజకీయ ప్రయోజనాల కోసం విద్వేషాలు సృష్టించవద్దని అచ్చి రెడ్డి అన్నారు. ప్రాంతీమ విబేధాలు లేవని.. అంతా కలిసి ఉంటామని అన్నారు. ఎన్టీఆర్ - వైఎస్సార్ వలె జగన్ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుంటున్నారని - వైఎస్ జగన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని అచ్చి రెడ్డి పిలుపునిచ్చారు.
Tags:    

Similar News