పేద బ్రాహ్మణునికి తలసాని సాయం..!

Update: 2020-04-30 05:31 GMT
కరొనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే , లాక్దీ డౌన్ వల్ల చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి కొందరు ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అయితే , లాక్ డౌన్ సమయంలో ఆదాయం ఏమి లేకపోవడంతో అలమటిస్తూ ఓ పురోహితుడు రోడ్డెక్కి వాహనదారులను యాచిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  

ఆ  పేద బ్రాహ్మణుడు వాహనదారులను యాచిస్తున్న సంఘటన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కంట పడింది. ఈ ఘటనను గురించి తెలుసుకొని చూసి చలించిపోయిన మంత్రి తలసాని అతని కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి వారికి సహాయం చేసేందుకు ముందుకువచ్చారు. వారికీ నెల రోజులకు సరిపడా బియ్యం, మంచినూనె, కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకులతో పాటు రూ.2,000ల నగదును మంత్రి తలసాని అందజేశారు. మంత్రి చేసిన ఈ సహాయానికి గాను ఆ పురోహితుడు దంపతులు ధన్యవాదాలు తెలిపారు.
Tags:    

Similar News