అఫ్గాన్ లో చోటు చేసుకున్న పరిణామాలు.. రాజ్యాధికారం తాలిబన్ల చేతికి వచ్చిన నేపథ్యంలో ఒక ఎటకారపు వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. అందులో తాలిబన్ల అండతో క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుడు.. రన్నింగ్ కాంపిటిషన్ కు దిగుతాడు. తన కంటే ముందు పరిగెత్తే వారందరిని షూట్ చేసుకుంటూ ముందుకెళ్లిపోతారు. అతగాడి విధ్వంసాన్ని భరించలేక.. ఎండ్ పాయింట్ దగ్గర ఉన్న వారు సైతం.. ఆ పాయింట్ ను ముందుకు తెచ్చేస్తారు. తాలిబన్ల రాజ్యం ఎలా ఉంటుందన్న దానికి సటైరికల్ గా ఉన్న ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది.
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తాలిబన్లు తాజాగా అనూహ్య రీతిలో రియాక్టు అయ్యారు. తాలిబన్ల చేతికి అఫ్గాన్ వెళ్లిపోవటంతో.. వివిధ రంగాల విషయంలో వారెలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇలాంటి వేళ.. ఊహించని రీతిలో రియాక్టు అయ్యారు తాలిబన్లు. అఫ్గాన్ క్రికెటర్లకు తాము అండగా ఉంటామని.. చెలరేగిపోయి ఆడాలని తాజాగా భరోసా ఇవ్వటంతో ఆశ్చర్యపోవటం ప్రపంచం వంతు అయ్యింది.
తాజాగా అఫ్గాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ హస్మతుల్లా షాహిది.. మాజీ క్రికెట్ బోర్డు అధికారులు అసదుల్లా.. నూర్ అలీ జద్రాన్ లతో కలిసి తాలిబన్ నాయకుడు అనీస్ హక్కానీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ దేశ క్రికెటర్లకు భరోసా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. సమావేశంలో.. క్రికెటర్లకు అండగా నిలుస్తామని.. చెలరేగిపోయి ఆడాలని ఉత్సాహపరుస్తూ.. క్రికెటర్లను ప్రోత్సహించటంలో ముందుంటామని వారు పేర్కొంటున్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్ లో అఫ్గాన్ జట్టు పాల్గొంటుందని భావిస్తున్నారు. యూఏఈలో జరిగే ఈ టోర్నీలో అఫ్గాన్ జట్టు ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మరి.. ఆ జట్టుతో ఆడేందుకు మిగిలిన జట్లు ఏ తీరులో రియాక్టు అవుతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏ విషయంలో ఎలా రియాక్టు అవుతారన్నది అర్థం కాని రీతిలో తాలిబన్ల తీరు ఉందన్న మాట వినిపిస్తోందని చెప్పక తప్పదు.