ఇక నుంచి ప్రెగ్నెన్సీకి కూడా రిజిస్ట్రేష‌న్..!!

Update: 2017-06-10 18:23 GMT
టీవ‌ల వ‌రుస‌గా వార్త‌ల్లో నిలుస్తున్న త‌మిళ‌నాడు హెల్త్ డిపార్ట్ మెంట్ అనూహ్యమైన నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి ప్రెగ్నెన్సీతో ఉన్న‌వాళ్లు తప్ప‌కుండా ఆరోగ్య శాఖ వ‌ద్ద వివ‌రాలు న‌మోదు చేసుకోవాలని స్ప‌ష్టం చేసింది. వ‌చ్చే జులై నుంచి అమ‌ల్లోకి రానున్న ఈ ప‌థ‌కం ద్వారా రిజిస్ట‌ర్ చేసుకున్న వాళ్ల‌కు ప్రెగ్నెన్సీ స‌మ‌యం నుంచి డెలివ‌రీ టైమ్ వ‌ర‌కు వాళ్ల‌కు కావాల్సిన స‌దుపాయాల‌న్నింటినీ హెల్త్ డిపార్ట్ మెంట్ స‌మ‌కూర్చుతుంద‌ట. దీంతో.. డెలివ‌రీ స‌మ‌యంలో వ‌చ్చే ప్ర‌మాదాల‌ను ఎదుర్కోవ‌చ్చ‌ని చెబుతున్నారు.

రాష్ట్రంలో జ‌న్మించే పిల్ల‌ల‌ మెడిక‌ల్ రికార్డులు కూడా ఖ‌చ్చిత‌త్వంతో పొందుప‌ర‌చడం కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. రిజిస్ట‌ర్ చేసుకోవాల‌నుకునే వాళ్లు నాన్ ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్ 102 కు కాల్ చేసి వివ‌రాలు తెలియ‌ప‌ర‌చ‌వ‌చ్చ‌ని...లేదంటే ఏదైనా హాస్పిట‌ల్ కెళ్లి వివ‌రాలు ఇవ్వొచ్చ‌ని చెప్పింది. ఆన్ లైన్ లో అయితే...హెల్త్ డిపార్ట్ మెట్ వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. అయితే.. ప్రెగ్నెన్సీ ఉండి హెల్త్ డిపార్ట్ మెంట్ లో రిజిస్ట‌ర్ చేసుకోని వాళ్లకు డెలివ‌రీ తర్వాత బిడ్డ పుట్టిన వివ‌రాల‌ను హెల్త్ డిపార్ట్ మెంట్ లో న‌మోదు చేయ‌ర‌ని... తర్వాత బ‌ర్త్ స‌ర్టిఫికెట్ కూడా రాద‌ని తెలిపారు.

త‌మిళ‌నాడులో 60 శాతం డెలివ‌రీలు ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లోనే జ‌రుగుతాయ‌ట‌. మిగిలిన డెలివ‌రీలు కొన్ని ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో, ఇంకొన్ని ఇంటివ‌ద్ద జ‌రగ‌డంతో వాళ్ల వివ‌రాలు తెలుసుకోవ‌డం క‌ష్టంగా ఉండ‌టం హెల్త్ డిపార్ట్ మెంట్ కు పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌ట‌. అందుకే ప్రెగ్నెంట్ గా ఉన్న‌ప్పుడే రిజిస్ట్రేషన్ చేయిస్తే.. ఎక్క‌డ డెలివ‌రీ అయినా.. పిల్ల‌ల బ‌ర్త్ రికార్డుల‌ను క‌రెక్ట్ గా మెయింటేన్ చేయొచ్చ‌ని త‌మిళ‌నాడు వైద్యారోగ్య శాఖ నిర్ణ‌యం తీసుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News