జయలలిత కొడుకును నేనే! అమ్మని వాళ్లే చంపేశారు

Update: 2017-03-15 04:34 GMT
అమ్మ మరణంపై నెలకొన్న గందరగోళం ఇప్పటికిప్పుడు సద్దుమణిగలా కనిపించట్లేదు. ఇప్పటికే అమ్మఅనారోగ్యంతో మరణించలేదని.. పోయెస్ గార్డెన్ లో అమ్మపై దాడి జరుగుతుందన్న ప్రచారం ముచ్చట తెలిసిందే.అదే సమయంలో తాను అమ్మ జయలలిల కూతుర్నిఅంటూ ఒక మహిళ బయటకు రావటం తెలిసిందే. ఇదో కొలిక్కి రాక ముందే తాజాగా ఈరోడ్ కు చెందిన ఒక వ్యక్తి (కృష్ణమూర్తి) తాను అమ్మ కొడుకునని.. తాను ఇంతకాలం తన పెంపుడు తల్లిదండ్రులతో ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.

అమ్మ స్నేహితురాలు వనితామణి ఇంట్లో పెంపుడు తల్లిదండ్రులతో తాను నివసించానని.. అసలు విషయం తెలిసి తాను 2016 సెప్టెంబరు పోయెస్ గార్డెన్ కు వెళ్లినట్లుగా చెప్పారు.అమ్మతో కలిసి నాలుగు రోజులు ఉన్నానని.. తనను తన కుమారుడిగా ప్రపంచానికి పరిచయం చేసేందుకు అమ్మ సిద్ధమయ్యారని.. ఆ విషయాన్ని పసిగట్టి చిన్నమ్మ శశికళ అమ్మతో గొడవ పెట్టుకున్నట్లుగా ఆరోపించారు.

తనను తన వారసుడిగా అందరికి పరిచయం చేయటానికి సిద్ధమవుతున్నవిషయాన్ని గుర్తించిన శశికళ.. సెప్టెంబరు 22వ తేదీ రాత్రి జయతో గొడవ పెట్టుకొన్నారని.. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పెద్ద వాగ్వాదం చోటు చేసుకుందని.. శశికళ తన తల్లిని మెట్ల మీద నుంచి తోసి చంపిందంటూ కృష్ణమూర్తి ఆరోపిస్తున్నారు.

ఈ విషయాల్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ ద్వారా వెల్లడించిన కృష్ణమూర్తి. ప్రాణభయం కారణంగా జరిగిన వాస్తవాన్ని బయటపెట్టలేదని.. ప్రస్తుతం మాత్రం ఎలాంటి భయం లేకుండా చెబుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. జయ ఆస్తులకు తానే అసలుసిసలు వారసుడిగా చెప్పుకున్న కృష్ణమూర్తి లాంటోళ్లు రానున్న రోజుల్లో మరెంతమంది వస్తారో?అమ్మకుకొడుకుగా చెబుతున్న కృష్ణమూర్తి..తండ్రి సమాచారం ఏమిటన్న విషయంపై క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News