క్రికెట్ అంటే అంతే మరి.. ఎవరి జాతకం ఎప్పుడు మారుతుందో చెప్పలేం.. నిన్నటి హీరో ఈరోజు జీరో కావొచ్చు.. నేటి జీరో రేపటి హీరో కావొచ్చు.. ఇలాంటివారే ప్రపంచ రికార్డు కూడా సాధించవచ్చు. తమిళనాడు యువ క్రికెటర్ నారాయణ్ జగదీశన్ ను ఉదాహరణగా తీసుకుని ఈ విషయం చెప్పొచ్చు. ఎందుకంటే సరిగ్గా ఐదు రోజుల కిందట అతడు అనామక ఆటగాడు. థర్డ్ గ్రేడ్ ప్లేయర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు. అయితే, అవకాశాలు పెద్దగా రాలేదు. అతడి విలువ కూడా రూ.20 లక్షలే. మొన్న అతడిని సూపర్ కింగ్స్ వదిలేసుకుంది. అంటే వచ్చే సీజన్ కు రిటైన్ చేసుకోలేదు. దీంతో పాటు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో అంబటి రాయుడు, రవీంద్ర జడేజా వంటి సీనియర్లున్నారు. ఎంతకూ వారి పేర్లే బయటకు వచ్చాయి కానీ.. నారాయన్ జగదీశన్ గురించి ప్రస్తావన రాలేదు.
అయితే, అతడే ఇప్పుడు దుమ్మురేపుతున్నాడు.వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ నారాయన్ జగదీశన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్. రంజీల్లో తమిళనాడుకు ఆడుతుంటాడు. ప్రతిభ ఉన్నవాడే. దీంతో చెన్నై తీసుకుంది.
కానీ పెద్దగా మ్యాచ్ లు ఆడించలేదు. కాగా, ఇప్పడు అతడు సెంచరీల మీద సెంచరీలు కొడుతూ దుమ్మురేపుతున్నాడు. అంతేకాదు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును నూ బద్దలు కొట్టాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఈ ఘనత సాధించాడు నారాయణ్ జగదీశన్.141 బంతుల్లో 277 పరుగులు.. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జగదీశన్ 277 (141 బంతుల్లో) పరుగులు సాధించాడు.
ఇందులో 25 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. లిస్ట్ ఏ లో ఇదే అత్యధిక స్కోరు. సర్రే ఆటగాడు ఏడీ బ్రౌన్ చేసిన 268 పరుగుల రికార్డును జగదీశన్ అధిగమించాడు. చినస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో అరుణాచల్‌పై మరో ఓపెనింగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ (154)తో కలిసి జగదీశన్ తొలి వికెట్‌కు 416 పరుగులు జోడించాడు. 2002లో జరిగిన కౌంటీ క్రికెట్‌లో గ్లామోర్గన్‌పై బ్రౌన్ 268 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో బ్రౌన్ రికార్డుతోపాటు టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (264) రికార్దూ బద్దలు కావడం విశేషం. కాగా, ఇదే క్రమంలో వరుసగా ఐదు సెంచరీలు సాధించిన బ్యాటర్‌గానూ రికార్డు సృష్టించాడు. గత ఐదు మ్యాచుల్లో హరియాణాపై 128, గోవాపై 168, ఛత్తీస్‌గడ్‌పై 107, ఆంధ్రప్రదేశ్‌పై 114, అరుణాచల్‌పై 277 పరుగులు సాధించాడు.
వామ్మో ఇదేం ఫామ్?.జగదీశన్ యువ క్రికెటర్. కొన్ని అవకాశాలిస్తే దుమ్మురేపేవాడేమో. కానీ, చెన్నై జట్టులో అవేమీ దొరకలేదు. చివరకు స్థానమే కోల్పోయాడు. అయితే, విజయ్ హజారే ట్రోఫీలో ఆ కసినంతా చూపుతున్నాడు. వరుసగా రెండు, మూడు సెంచరీలే ఎక్కువనుకుంటే.. ఇప్పుడు ఐదు సెంచరీలు కొట్టాడు. ఐపీఎల్ లో ప్రభ తగ్గిన చెన్నైకి వాస్తవానికి ఇలాంటి బ్యాట్స్ మన్ అవసరం. కానీ, ఆ జట్టు అలాంటివాడిని వదులుకుంది. ఇప్పుడు.. అరెరె.. తప్పు చేశామా? అని నాలుక్కర్చుకుంటుందేమో?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.