తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అలనాటి సినీ తార.. తమిళ ప్రజలందరికీ అమ్మ జయలలిత. ఆమె మృతి చెంది ఏళ్లు గడుస్తున్నా ఆమె ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమెను తరతరాలుగా గుర్తించుకునేలా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జయలలిత నివసించిన భవనాన్ని ‘వేద నిలయం’ స్మారక కేంద్రంగా మార్చేందుకు నిర్ణయించింది. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ నోటీసు జారీ చేసింది. పొయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసాన్ని స్మారక కేంద్రంగా మార్చేందుకు చర్యలు చేపట్టింది.
వాస్తవంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి 2018 ఆగస్టులో పోయెస్ గార్డెన్‌లోని నివాసాన్ని స్మారక కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. ఆ క్రమంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. భూ సేకరణ అధికారి/రెవిన్యూ డివిజనల్ అధికారి సిఫారసు మేరకు ప్రభుత్వం /చెన్నై కలెక్టర్ ఈ భూమి, భవనాలు ప్రజా ప్రయోజనాల కోసం అవసరమని సంతృప్తి చెందినట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. జయలలిత నివాసం ‘వేద నిలయం’ ప్రభుత్వ స్మారక కేంద్రంగా మార్చేందుకు అవసరమని తెలిపింది. ఈ నిర్మాణంతో కుటుంబాలు నిర్వాసితులు కావడం, వారికి పునరావాసం కల్పించడం వంటివేవీ ఉండవని స్పష్టం చేశారు.
వాస్తవంగా పోయెస్ గార్డెన్‌లోని ఇంటిని జయలలిత రాజకీయాల్లోకి రాకముందే 1962లో కొన్నారు. పోయేస్ గార్డెన్ ప్రాంతం ప్రముఖుల నివాస స్థలం. ఇక్కడ ఉన్న ఇంటిని వేద నిలయంగా మార్చుకుని జయలలిత ఇక్కడే నివసిస్తున్నారు. హీరోయిన్‌గా ఉన్నప్పుడు జయలలిత ఆర్థిక వ్యవహరాలను తన తల్లి చూసుకుంటోంది. 1962 తర్వాత కొన్నాళ్లకు స్థిర నివాసంగా ఏర్పడింది. ఆమె తన సినిమా డబ్బులతో నిర్మించుకున్నది. అయితే జయలలిత ఆకస్మిక మరణంతో ఆ ఇంటిపై అందరి కన్ను పడింది. ఆమె మేనకోడలు, మేనల్లుడుతో పాటు శశికళ తదితరులు ఆ ఇంటిని తమ ఆధీనంలో ఉంచుకోవాలని భావించారు. అయితే ప్రభుత్వం ఆ ఇంటిని కాపాడుకుని చివరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు జయలలిత స్మారక కేంద్రంగా మార్చనున్నారు. ఇక ఆ నిర్మాణ పనులు వేగవంతమయ్యే అవకాశం ఉంది.