దివంగత నేత , తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత 2016 లో అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో పోరాడుతూ ... చివరికి ఆసుపత్రిలోనే కన్నుమూశారు. ఆ తర్వాత తమిళనాడు రాజకీయాలలో శరవేగంగా మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎప్పటినుండో హీరోయిన్ , ఆ తరువాత సీఎంగా కొన్నేళ్లు విధులు నిర్వర్తించడంతో ఆమె భారీగా ఆస్తులు సంపాదించింది. జయలలితకు ఉన్న వ్యక్తిగత ఆస్తుల ప్రచారం గురించి వేరే చెప్పనక్కర్లేదు. కానీ, తన ఆస్తులకి వారసులని ప్రకటించకుండానే మరణించారు. ఆమెకి సంబంధించిన అన్ని విషయాలని ..శశికళ ,ఆమె బంధువులే చూసేవారు. జయలలితకు సంబంధించిన స్థిరాస్తుల గురించి ఈ మధ్య వార్తలు వచ్చాయి. వాటివి విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది అని, ఓ భారీ టీ ఎస్టేట్ ఉందని దాని విలువే వెయ్యి కోట్ల రూపాయల పైనే అని వార్తలు వచ్చాయి. వాటి వివరాలు ఒక్క శశికళకు మాత్రమే తెలుసునని అందరూ చర్చించుకుంటున్నారు.
ఆ వేదనిలయంలో ఉన్న ఆస్తులు భారీగా ఉన్నాయని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అయితే , ఆ వేదనిలయాన్ని ఈపీఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ఇంటిని చెన్నై జిల్లా కలెక్టరేట్ పరిధి నుంచి సమాచార శాఖ పరిధిలోకి తెచ్చారు. త్వరలో ట్రస్ట్‌కు అప్పగించనున్నారు. ప్రస్తుతం సేకరించిన జాబితా మేరకు అమ్మ ఇంట్లో 8 వేల వస్తువులు ఉన్నట్టు తేలింది. ఆ ఇంటిని అమ్మ స్మారక మందిరంగా మార్చే రీతిలో సీఎం, డిప్యూటీ సీఎంల నేతృత్వంలో ట్రస్ట్ ఏర్పాటైంది. న్యాయపరంగా చిక్కులు ఎదురుకాకుండా ప్రత్యేక చట్టాన్ని సైతం తీసుకొచ్చారు.
ఈ క్రమంలో జయలలితకు సంబంధించిన భారీ స్థాయిలో బంగారం, వెండి ఇంకా అనేక విలాసవంతమైన వస్తువులు ఆ ఇంట్లోనే ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అమ్మ ఇంట్లో 32 వేల 700 పుస్తకాలు ఉన్నట్టు లెక్కించారు. అలాగే, 8,376 వస్తువులు ఉన్నాయట. ఇందులో 14 కేజీలుగా చెప్తున్న 437 బంగారు ఆభరణాలు, 601.4 కేజీలుగా చెప్తున్న 867 వెండి వస్తువులు ఉన్నాయి. అలాగే, ఆరు వేల పాత్రలు, 556 ఫర్నీచర్లు, 162 చిన్న చిన్న వెండి వస్తువులు,108 అలంకరణ వస్తువులు, 29 ఫోన్లు, సెల్ ఫోన్లు, 15 పూజా సామగ్రి, పది ఫ్రిడ్జ్ లు, 38 ఎసీలు, 11 టీవీలు, ఆరు గడియారాలు ఉన్నట్టుగా లెక్క తేల్చారు. అలాగే, 10,438 వివిధ వస్త్రాలు ఉన్నట్టు తేల్చారు. వీటన్నింటిని ట్రస్ట్‌కు మరి కొద్ది రోజుల్లో అప్పగించబోతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బస చేసిన ఇళ్లు కావడంతో.. ఆ ఇంట్లో ఉన్న విలాసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా, అమ్మ నిలయాన్ని ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకోవడంతో ఆ పరిసరాల్లో భద్రతను పెంచారు. ఆ ఇంటి వైపుగా అధికారులు తప్ప, మరెవ్వరూ వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.