ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం... రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్థానం కలిగిన నేతే. పలు దఫాలుగా ఎమ్మెల్యేగా - మంత్రిగా పనిచేసిన తమ్మినేని... జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తమ్మినేని స్పీకర్ గా ఎన్నికయ్యారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని వ్యవహారంలో కాస్తంత నెమ్మదస్తుడిగానే పేరుంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో చంద్రబాబు కేబినెట్ లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో మాత్రం ఆయనకు కాస్తంత దూకుడు ఎక్కువేనన్న మాట వినిపించింది. అయితే ఆ తర్వాత ప్రజారాజ్యం - ఆ తర్వాత వైసీపీలో చేరిన తమ్మినేని... వయసు మీద పడుతున్న నేపథ్యంలో యుక్త వయసులో ఉన్న దూకుడుకు స్వస్తి చెప్పారన్న వాదనలూ వినిపించాయి.
తాజాగా తనను స్పీకర్ గా చేసిన జగన్ ను ఆకాశానికి ఎత్తేసిన తమ్మినేని... విపక్ష నేత చంద్రబాబు - అసెంబ్లీలో ఆ పార్టీ ఉప నేత అచ్చెన్నాయుడులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ్మిేనేని ఈ వ్యాఖ్యలను ఎక్కడో... పెద్దగా జనాలు లేని చోట కాదు. స్వయంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలుపంచుకున్న వేదిక మీద నుంచే తమ్మినేని ఈ వ్యాఖ్యలు చేశారు.
తమ్మినేని ఏమన్నారంటే... ‘జగన్ మోహన్ రెడ్డి - రాజశేఖరెడ్డి ఉన్నప్పుడు వర్షం రాదంటే వార్త అవుతుంది. వర్షం వస్తే అసలు అది వార్తే కాదు. వరుణదేవుడు ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. నేనీ మాట చెప్పకూడదు కానీ. కరవు-చంద్రబాబు నాయుడు కవల పిల్లలు. వరుణుడు-వైఎస్సార్ కుటుంబం బాంధవ్యంతో కూడుకున్న వ్యక్తులు. ఈరోజు వర్షం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి నా ప్రసంగాన్ని ముగిస్తున్నా జైహింద్.. జై జగన్’ అంటూ తమ్మినేని ఓ రేంజిలో ప్రసంగించారు. అంతటితో ఆగని తమ్మినేని... అసెంబ్లీలో టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై విమర్శలు చేస్తే తోలు తీస్తామని కూడా తమ్మినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఈ వ్యాఖ్యలతో తమ్మినేని... తాజా మాజీ స్పీకర్ కోడెలకు తానేమీ తీసిపోనని నిరూపించుకున్నారన్న వాదన వినిపిస్తోంది.