అసలు సిసలు పోరాటం చూపిస్తా: తమ్మినేని

Update: 2020-01-10 08:30 GMT
మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న చంద్రబాబుకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం జలక్ ఇచ్చారు. అమరావతిలో చంద్రబాబు చేసేది ఉద్యమం కాదని.. అసలు ప్రజా ఉద్యమం ఏంటో తాము చూపిస్తామని తమ్మినేని సవాల్ చేశారు.

మూడురాజధానుల నిర్ణయంపై సీఎం జగన్ కు ఉత్తరాంధ్ర ఫోరం అండగా ఉంటుందని తమ్మినేని సీతారం హామీ ఇచ్చారు. సీఎం నిర్ణయాలపై పోరాడుతున్న ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం చెబుతామని అన్నారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్, ఆస్తులను కాపాడుకోవడానికే చంద్రబాబు జనాలను రెచ్చగొట్టి ఉద్యమం చేస్తున్నారని..  అసలు సిసలు ఉద్యమాన్ని తాము చూపిస్తామని స్పీకర్ తమ్మినేని తొడగొట్టారు.

త్వరలోనే శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకూ సాగే ఈ ప్రజా ఉద్యమం ఎలా ఉంటుందో చంద్రబాబు చూస్తారని తమ్మినేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నేళ్లుగా పేదరికంలో ఉన్న సీమ - ఉత్తరాంధ్ర గుర్తించి జగన్ న్యాయం చేస్తుంటే కళ్లు కనిపించడం లేదా అని  దుయ్యబట్టారు.  విశాఖ రాజధానిని మేం దక్కించుకునేందుకు ఎంతవరకైనా పోరాడుతామని తమ్మినేని అన్నారు.  మా పేదరికం, ఆకలి మంటలతో బాబు అడుకోవద్దని హెచ్చరించారు.జేఏసీగా ఏర్పడి  ప్రజా ఉద్యమం నిర్మిస్తామని స్పష్టం చేశారు.  

    

Tags:    

Similar News