లిక్కర్ బ్రాండ్స్ సంగతి నీకెందుకు తల్లి?

Update: 2019-12-16 10:10 GMT
ఏపీ అసెంబ్లీలో నవ్వుల పూలు పూశాయి. మద్యపాన నిషేధంపై చర్చ సందర్భంగా టీడీపీ  ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ కామెడీ పండించారు. టీడీపీ సభ్యులు మధ్యపాన నిషేధంపై గొడవ చేస్తుండగా.. మాట్లాడిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ వైన్ షాపులతో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా ఈ టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అని జగన్ అన్నారని.. ఇప్పుడు దశలవారీగా అంటున్నారని.. మాట తప్పడం కాదా అంటూ ప్రశ్నించారు.  మద్యంషాపులు ఇళ్లు, ఆలయాలు, స్కూళ్ల మద్యలో పెడుతున్నారని.. చాలా మంది మహిళలు తనకు ఫిర్యాదు చేశారని అసెంబ్లీ దృష్టికి ఈమె తీసుకొచ్చారు.

గతంలో చాలా బ్రాండ్స్ ఉండేవని.. ఇప్పుడు వైసీపీ సర్కారు చాలా తగ్గించిందని ఎమ్మెల్యే భవానీ మాట్లాడారు. ఇలా మద్యం బ్రాండ్ల విషయాన్ని భవానీ ప్రస్తావించగానే స్పీకర్ తమ్మినేని సీతారం కల్పించుకున్నారు. ‘నీకెందుకు తల్లీ ఆ బ్రాండ్స్ విషయం.. వాళ్లు మాట్లాడుతార్ వదిలేయ్’ అనండంతో సభలో నవ్వులు విరబూశాయి. సభ్యులంతా పెద్దగా నవ్వారు.  ఆ తర్వాత ప్రసంగాన్ని భవానీ ముగించారు.


Full View

Tags:    

Similar News