రాజధాని అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి మూడు రోజులపాటు ఈ ప్రత్యేక సమావేశాలు కొనసాగనున్నాయి. పరిపాలన వికేంద్రీకరణపై ఈ ప్రత్యేక సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ క్రమంలో సభ ప్రారంభమైన వెంటనే రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును రాష్ట్ర మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. ఆ తరువాత సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స ప్రవేశపెట్టారు. అనంతరం వికేంద్రీకరణ బిల్లుపై చర్చను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. టీడీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే ఆయన ప్రసంగం కొనసాగుతోంది.
ఇకపోతే ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రారంభంలోనే స్పీకర్ తనదైన శైలిలో సెటైర్లు వేయడం ప్రారంభించారు. సభలోకి ఎంటర్ అయిన స్పీకర్ తమ్మినేని.. తన సీట్లో కూర్చోబోతుండగా.. బ్యాడ్ మార్నింగ్ సార్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు అయన వెల్కమ్ చెప్పారు. దీనిపై స్పందించిన స్పీకర్.. ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్పి, మంచి జరగాలని కోరుకుంటారని, కానీ బ్యాడ్ మార్నింగ్ చెప్పేవారి గురించి ఏం మాట్లాడగలమంటూ స్పీకర్
చమత్కరించారు.