అమెరికాలో చ‌దువుకు అండ‌గా తానా ఆఫ‌ర్‌

Update: 2017-07-10 05:09 GMT
అమెరికాలో చ‌దువుకోవాల‌నుకునే వారికి.. చ‌దువుకుంటున్న‌వారికి సువ‌ర్ణ అవ‌కాశంగా చెప్పాలి. అగ్రరాజ్యంలో చ‌దువు అంటే మాట‌లు కాదు. బోలెడ‌న్ని డ‌బ్బులు కావాలి. ఆర్థిక స‌మ‌స్య‌లు కార‌ణంగా అమెరికాలో చ‌దువుకోవాల‌నుకునే ఆశ‌ను మొగ్గ‌లోనే తుంచేసుకునే వారు బోలెడంత మంది. ఇక‌.. అమెరికాలో చ‌దువుకుంటూ ఆర్థికంగా ఇబ్బందులు ప‌డే వారు చాలామందే ఉంటారు.

అలాంటి వారికి అండ‌గా ఉండేందుకు.. అమెరికాలో చ‌దువుకు త‌మ‌దైన ఆర్థిక అండ‌ను అందించేందుకు ముందుకు వ‌చ్చేసింది ఉత్త‌ర అమెరికా తెలుగు సంఘం.. షార్ట్ క‌ట్ లో తానా.

2017-18 సంవ‌త్స‌రానికి ఏడాదికి డిగ్రీ చ‌దువుకునే విద్యార్థులు తామిచ్చే ఉప‌కార వేత‌నాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించారు తానా ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ శృంగ‌వ‌ర‌పు నిరంజ‌న్‌. అమెరికాలో చ‌దువుకునే వారి కోసం ఏడు ర‌కాల‌నైన గ్రాడ్యుయేట్ ఉప‌కార వేత‌నాల్ని తాము ఇస్తున్న‌ట్లుగా చెప్పారు.

ఒక్కో విద్యార్థికి సెమిస్ట‌ర్‌ కు 500 డాల‌ర్లు చొప్పున 2వేల డాల‌ర్లు అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌న్నారు. ఉత్త‌ర అమెరికాలో ఉన్న‌త పాఠ‌శాల విద్య‌ను పూర్తి చేసి.. కాలేజీకి వెళ్లే విద్యార్థుల‌కు నాలుగు ర‌కాలైన  ఉప‌కార వేత‌నాలు ఇస్తామ‌ని.. మ‌రిన్ని వివ‌రాల కోసం  Chairman@tanafoundation.org ఈ-మెయిల్‌లో సంప్రదించాలన్నారు.
Tags:    

Similar News