ఎయిర్ ఇండియా మళ్లీ సొంతగూటికే చేరింది. కొన్ని దశాబ్ధాల క్రితం ఎయిర్ ఇండియాను స్థాపించింది టాటాలే.. స్వాతంత్ర్యానికి ముందే ఈ విమానయాన సంస్థను 'టాటా' పేరుతో స్థాపించారు. అయితే స్వాతంత్ర్యం అనంతరం దీన్ని భారత ప్రభుత్వం టేకోవర్ చేసింది. తాజాగా ఎయిర్ ఇండియా సంస్థ టాటా సన్స్ పరమైంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎయిర్ ఇండియాను కేంద్రం అమ్మకానికి పెట్టింది.
ఈ క్రమంలోనే స్పైస్ జెట్ తోపాటు ఎయిర్ ఇండియా కూడా బిడ్ దాఖలు చేసింది. రెండు బిడ్లను పరిశీలించిన కేంద్ర మంత్రుల బృందం చివరకు టాటా సన్స్ కే మొగ్గు చూపింది. ఎయిర్ ఇండియాను సొంతం చేసుకునేందుకు టాటా సన్స్ రూ.18000 కోట్లను వెచ్చించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) కార్యదర్శి తమిన్ కాంతపాండే అధికారికంగా ప్రకటించారు.
'టాటాసన్స్ ఏవియేషన్' పేరుతో 1946లో దీన్ని స్థాపించారు. ఆ తర్వాత ఇది ఎయిర్ ఇండియాగా మారింది. 1948లో యూరప్ కు విమాన సేవలతో ఎయిర్ ఇండియా ఇంటర్నేషన్ గా ఏర్పాటైంది. దేశఈయంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఇది ఏర్పాటైంది. అప్పట్లో ఈ సంస్థలో ప్రభుత్వానికి 49శాతం, టాటాలకు 25శాతం, మిగతా వాటా పబ్లిక్ దగ్గర ఉండేది. 1953లో ఎయిరిండియాను కేంద్రం జాతీయం చేసింది. 1990,2000 దాకా ఎయిర్ ఇండియా ఆధిపత్యం కొనసాగినా తర్వాత ప్రైవేటు సంస్థలు కూడా రంగంలోకి దిగడం మొదలయ్యాక నష్టాలు ప్రారంభమయ్యాయి.
2007 నుంచి ఎయిర్ ఇండియా నష్టాల్లోనే కొనసాగింది. భారీ రుణభారంతో 2017లో ప్రైవేటీకరించాలని నిర్ణయించారు. గత ఏడాది నిబంధనలు సడలించి టెండర్ పిలిచారు. టాటా, స్పైస్ జెట్ సహా పలు కంపెనీలు బిడ్ దాఖలు చేశాయి. ఇందులో టాటా సన్స్ అత్యధికంగా 18వేల కోట్లతో బిడ్ సమర్పించింది.
ఎయిర్ ఇండియా నిజానికి 1932లో 'టాటా ఎయిర్ లైన్స్'గా ప్రారంభమైంది. జహంగీర్ రతన్ జీ దాదాభాయ్ (జేఆర్.డీ) దీన్ని నెలకొల్పారు. బాంబే-కరాచీ మధ్య తొలి పోస్టల్ సర్వీసులు నడిచారు. ఆ తర్వాత ప్రయాణికులకు విమాన సర్వీసులు ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చాక భారత ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ 68 ఏళ్ల తర్వాత తిరిగి సొంత గూటికే టాటాల చేతికే ఎయిర్ ఇండియా చేరడం గమనార్హం. ప్రస్తుతం ఎయిర్ ఇండియా రుణం రూ.60074 కోట్లుగా ఉంది. దీన్ని టాటా సన్స్ ఎలా అధిగమిస్తుందో చూడాలి.