సినీ నటుడు కమ్ పొలిటీషియన్ అయిన నందమూరి బాలక్రిష్ణకు మరో అతి ముఖ్యమైన యాక్టివిటీ ఉంది. అది ఆయన తల్లి గారి పేరు మీద హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బసవరామ తారకం క్యాన్సర్ ఆసుపత్రి. ఈ ఆసుపత్రికి బాలయ్య చైర్మన్ గా వ్యహరిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఆసుపత్రిలో చేరిన వారికి ఏపీ సర్కార్ డబ్బులు చెల్లిస్తుంది. ఆ విధంగా చూస్తే ఏపీ నుంచి వెళ్లే క్యాన్సర్ రోగులు ఎక్కువ మంది ఈ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలను అందుకుంటున్నారు.
దాంతో ఏపీలో ఆరోగ్యశ్రీని మరింతంగా విస్తరిస్తూ వేలాది రోగాలను అందులో జత చేర్చినట్లుగా వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటుంది. దీని మీద అసెంబ్లీలో ప్రసంగం చేసిన జగన్ 3,118 రోగాలకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సను అందిస్తున్నట్లుగా చెప్పారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా దీని రూపు రేఖలు మార్చేశామని చెప్పారు. నెట్ వర్క్ ఆసుపత్రులకు టీడీపీ హయాంలో డబ్బులు బకాయి పెడితే తమ ప్రభుత్వం చెల్లించింది అని అసెంబ్లీలో మాట్లాడుతూ ఆ వివరాలు చెప్పుకొచ్చారు.
ఇక ఆయన మరో ఆసక్తికరమైన విషయాన్ని ఈ సందర్భంగా చెప్పారు. బసవతారకం ఆసుపత్రిని నడుపుతున్న బాలక్రిష్ణ టీడీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ తర తమ భేదాలు లేకుండా సకాలంలో ప్రభుత్వం తరఫున ఆరోగ్యశ్రీ మొత్తాలని ఎప్పటికపుడు చెల్లిస్తున్నామని జగన్ పేర్కొన్నారు.గతంలో చంద్రబాబు హయాంలో బిల్లులు పెట్టినా వెంటనే సొమ్ము చెల్లించే పరిస్థితి లేదని, ఇపుడు తమ ప్రభుత్వం వేగంగా సొమ్ములు ఇస్తోందని, ఈ విషయాన్ని బసవతారం ఆసుపత్రి వారే మాట్లాడుకుంటున్నారు అని కొత్త విషయాన్ని చెప్పారు.
బాలయ్య బావ సీఎం గా ఉన్నా సకాలంలో చెల్లించని మొత్తానికి ఇపుడు వైసీపీ సర్కార్ టైమ్ టూ టైమ్ బసవతారం ఆసుపత్రికి చెల్లిస్తోందని జగన్ గొప్పగా చెప్పుకున్నారు. జగన్ ఏలుబడిలోనే సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయని ఆసుపత్రి వారు కూడా అనుకుంటున్నారు అంటే ఇదే తమ ఘనత అని జగన్ చెప్పకనే చెప్పారు.
ఏకంగా 16,255 కోట్ల రూపాయలను ఏపీలో వైద్య రంగానికి చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. మొత్తానికి మిగిలిన విషయాలు ఎలా ఉన్నా బావ ఏలుబడిలో కన్నా బాలయ్యకు తన ఏలుబడిలోనే బిల్స్ అన్నీ కరెక్ట్ గా టైమ్లీ గా చెల్లిస్తున్నామని చెప్పడం ద్వారా నందమూరి నటసింహాన్ని న్ని ఎమోషనల్ గా జగన్ టచ్ చేశారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.