టీడీపీ.. ఖరారైన ఎంపీ టికెట్లు సగమే!

Update: 2019-03-12 05:29 GMT
వచ్చేసోమవారం నుంచి నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో కూడా ఏపీలోని పార్టీలు ఇంకా ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం  అయినట్టుగా కనిపించడం లేదు. ప్రత్యేకించి అభ్యర్థుల ఖరారు విషయంలోనే పార్టీల తర్జనభర్జన కొనసాగుతూ ఉంది. ప్రత్యేకించి అధికార టీడీపీలో ఎంపీ టికెట్ల విషయంలో ఈ వ్యవహారం మరింత ప్రతిష్టంభనగా మారింది.

ఏపీలోని పాతిక ఎంపీ సీట్లలో ఇప్పటి వరకూ టీడీపీ అభ్యర్థిత్వాలు ఖరారు అయ్యింది సగం స్థానాలకే అని తెలుస్తోంది. పదమూడు ఎంపీ సీట్లకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఖరారు అయ్యారని.. మరో పన్నెండు స్థానాల్లో చంద్రబాబు  నాయుడు సమీక్షలు కొనసాగిస్తూ ఉన్నారని తెలుగుదేశం వర్గాలే ధ్రువీకరిస్తూ ఉన్నాయి. పార్టీ తరఫున ఉన్న సిట్టింగులు బయటకు వెళ్లిపోవడం  - ఆఖరికి అభ్యర్థిత్వం ఖరారు  అయ్యిందన్న వాళ్లు కూడా జంప్  అయిపోవడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాల కథ మళ్లీ మొదటకు వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇప్పటి వరకూ ఖరారు అయిన సీట్ల విషయానికి వస్తే…

శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు
అరకు- కిషోర్  చంద్రదేవ్
అనకాపల్లి –ఆనంద్
కాకినాడ- సునీల్
ఏలూరు-మాగంటి బాబు
మచిలీపట్నం- కొనకళ్ల నారాయణ
విజయవాడ- కేశినేని నాని
గుంటూరు-జయదేవ్
చిత్తూరు-శివ ప్రసాద్
కడప- ఆదినారాయణ రెడ్డి
అనంతపురం- జేసీ పవన్
హిందూపురం-నిమ్మల కిష్టప్ప
కర్నూలు- కోట్ల  సూర్య ప్రకాష్ రెడ్డి

పదమూడు స్థానాల విషయంలో క్లారిటీ వచ్చిందని - మిగతా స్థానాల విషయంలో చంద్రబాబు కసరత్తు సాగుతూ ఉందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News