తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంస్థాగతంగా ఇపుడు పూర్తి దృష్టి సారించారు. ఒక వైపు వైసీపీ సర్కార్ చేస్తున్న తప్పుడు పనులను ఎండగడుతూనే మరో వైపు పార్టీని కూడా గాడిన పెట్టాలని బాబు కృత నిశ్చయంతో ఉన్నారని తెలుస్తోంది. ఏపీలో మూడేళ్ళు గడచినా టీడీపీలో ఇంకా నిస్తేజం కొనసాగుతోంది. చంద్రబాబు బయటకు వస్తే వచ్చే నాయకులే తప్ప తమంతట తాము జనాల్లోకి వెళ్ళి పార్టీని ముందుకు తీసుకెళ్ళే వారు చాలా చోట్ల కనిపించడంలేదని బాబు భావిస్తున్నారుట. అంతే కాదు, నాలుగు దశాబ్దాల నాటి పార్టీ కావడంతో అనేక నియోజకవర్గాలలో వర్గ పోరు కూడా టీడీపీని పట్టి పీడిస్తోంది అంటున్నారు.
ఇక మరి కొన్ని చోట్ల సరైన ఇంచార్జులు లేక పార్టీ వెలవెలబోతోంది. దీంతో ఇలాంటి లోపాలను పెట్టుకుని ముందుకు ఎలా సాగుతామన్న ఆలోచన అయితే పార్టీ పెద్దలలో ఉందని అంటున్నారు. టీడీపీ హై కమాండ్ గుర్తించిన మేరకు చూస్తే ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో దాదాపుగా నలభై చోట్ల ఆధిపత్య పోరు ఒక స్థాయిలో నడుస్తోంది అని అంటున్నారు. ఈ పోరు వల్ల పార్టీ బలంగా ఉన్నా కూడా బలహీనంగా మారే సీన్ ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒక వైపు పార్టీకి మంచి రోజులు వస్తున్నా, జనాదరణ ఉంటున్నా నేతల తీరు మాత్రం మార్పు లేకపోవడం వల్లనే ఈ దుస్థితి అని హై కమాండ్ అంచనాకు వచ్చిందని అంటున్నారు.
ఇక ఇలాంటి ఆధిపత్య పోరు ఉన్న చోట్ల పిలిచి మందలించడంతో పాటు ఒకవేళ తీరు మార్చుకోని వారి విషయంలో కఠినంగా ఉండాలని కూడా చూస్తున్నారుట. అలాగే వర్గ పోరునకు ఎవరైనా ప్రోత్సాహం ఇచ్చినా వారి పట్ల సీరియస్ గానే ఉండాలని భావిస్తున్నారుట.
గతంలో ఆడింది ఆటగా సాగిపోయిందని, ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా ఉంటాయి కాబట్టి వీటిని ఫేస్ చేయాలీ అంటే మొహమాటాలకు తావు లేకుండానే చూసుకోవాలని హై కమాండ్ డిసైడ్ అయింది అని అంటున్నారు.
అలాగే మరో ముప్పయి చోట్ల ఇంచార్జులు బలంగా లేరు. ఇక్కడ క్యాడర్ బాగా ఉన్న నడిపించే లీడర్ సమర్ధంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. వీటి విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టి సమర్ధులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా పార్టీ దూసుకుపోయే విధంగా చర్యలు చేపట్టాలనుకుంటున్నారు. ఇక పార్టీలో వర్గ పోరు గ్రూపు తగదాలు ఉన్న చోట ప్రాధమికంగా హెచ్చరించి దారికి తెచ్చేందుకు ప్రత్యేక కమిటీలను కూడా త్వరలో పార్టీ హై కమాండ్ ఏర్పాటు చేయనుంది అని అంటున్నారు.
ఎన్నికలు ఎపుడు జరిగినా సైకిల్ జోరుగా దూసుకుపోవాలని చంద్రబాబు పరితపిస్తున్నారు. తాను ఎంత చురుకుగా ఉన్నా నాయకులు కూడా సరిసమానంగా జోరు చూపిస్తేనే తప్ప ఎన్నికల్లో విజయం సాధించడం జరిగేది కాదని అంటున్నారు.
ఏది ఏమైనా ఇన్నాళ్ళూ వైసీపీ వైపే చూస్తూ వారిని విమర్శిస్తూ కాలం గడిపేసిన టీడీపీ హై కమాండ్ ఇపుడు సొంత పార్టీలో దిద్దుబాట్లకు తెర తీస్తోంది. ఇది నిజంగా మంచి పరిణామమే అని తమ్ముళ్ళు అంటున్నారు. అదే టైమ్ లో పనిచేసే వారికే పట్టం కట్టాలని అధినాయకత్వం నిర్ణయించడం పట్ల కూడా వారు అనందం వ్యక్తం చేస్తున్నారు.