బాబు భద్రతకు 183 మంది ఉన్నారట

Update: 2020-02-19 07:30 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు భద్రత మీద తరచూ ఆందోళన వ్యక్తమవుతూ ఉంటుంది. ఇటీవల ఆయనకు జెడ్ ప్లస్ సెక్యురిటీని తొలగిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి టీడీపీ నేతలు.. కార్యకర్తలు తరచూ ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటివేళ.. బాబుకు ఎంతో కాలంగా కల్పిస్తున్న జెడ్ ప్లస్ భద్రత ను తొలగించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని చెబుతున్నారు ఏపీ పోలీసులు. తాజాగా బాబుకు కల్పిస్తున్న భద్రత మీద ఏపీ డీజీపీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

దీని ప్రకారం దేశంలో అత్యంత హైసెక్యురిటీ కల్పిస్తున్న వ్యక్తుల్లో చంద్రబాబు ఒకరు. ప్రస్తుతం ఆయనకు జెడ్ ప్లస్ భద్రతను కల్పిస్తున్నారు. సెక్యురిటీ రివ్యూ కమిటి నిర్ణయం మేరకు భద్రతలో కొద్దిపాటి మార్పులు - చేర్పులు చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా బాబు భద్రత విషయం లో తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ఏపీ డీజీపీ చెబుతున్నారు.

బాబుకు భద్రత కల్పిస్తున్న మొత్తం 183 మంది సిబ్బందిలో.. విజయవాడ లో 135 మంది ఉంటే.. మరో 48 మందితో కూడిన భద్రతా సిబ్బంది హైదరాబాద్ లో ఉంటారని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే.. బాబు భద్రత మీద బయట జరుగుతున్న ప్రచారానికి..వాస్తవానికి ఏ మాత్రంసంబంధం లేదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News