ఎన్టీఆర్ ను అవ‌మానిస్తున్న తెలుగుదేశం పార్టీ!

Update: 2020-01-29 04:55 GMT
ఎన్టీఆర్ ను త‌మ అవ‌స‌రానికి అనుగుణంగా వాడుకోవ‌డం తెలుగుదేశం పార్టీకి కొత్త ఏమీ కాదు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ నుంచి లాక్కొన్నాకా ఆయ‌న విష‌యంలో చంద్ర‌బాబు నాయుడు ర‌కర‌కాలుగా వ్య‌వ‌హ‌రించారు. కొన్ని సార్లు ఎన్టీఆర్ ను ప్ర‌శంసించ‌డం - మ‌రి కొన్ని సార్లు ఎన్టీఆర్ ను సైడ్ లైన్ చేయ‌డం చంద్ర‌బాబుకు కొత్త కాదు. ఇక ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ పేరు ఎత్తే వారు పెద్ద‌గా లేరు. ఏదో ఎన్టీఆర్ జ‌యంతికి - వ‌ర్ధంతికి ఆయ‌న పేరెత్తుతూ ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పూర్తిగా చంద్ర‌బాబు ప్రాప‌ర్టీగా మారిన‌ట్టుగా ఉంది.

ఇక మండ‌లి ర‌ద్దు విష‌యంలో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుతో స‌హా తెలుగుదేశం పార్టీ వాళ్లంతా మండి ప‌డుతూ ఉన్నారు. అయితే మండ‌లి ర‌ద్దును ముందుగా స‌మ‌ర్థించింది ఎన్టీఆరే అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌ను ముఖ్య‌మంత్రి అయ్యాకా.. మండ‌లిలో కాంగ్రెస్ ఆధిప‌త్యాన్ని ఎన్టీఆర్ స‌హించ‌లేక‌పోయారంటారు. అస‌లు మండ‌లి అవ‌స‌ర‌మే లేద‌ని అప్ప‌ట్లో ఎన్టీఆర్ నిర్ణ‌యించారు. ఈ మేర‌కు తీర్మానం చేసి - మండ‌లిని ర‌ద్దు చేస్తూ ఢిల్లీకి తీర్మానం పంపారు. అప్ప‌ట్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే దాన్ని ఆమోదించింది.

అలా ఏపీలో తొలి సారి మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యాన్ని తీసుకుంది ఎన్టీఆరే. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు కూడా మండ‌లి పున‌రుద్ధ‌ర‌ణ చేయ‌లేదు. అంతేగాక మండ‌లి పున‌రుద్ధ‌ర‌ణ అని వైఎస్ నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు కూడా చంద్ర‌బాబునాయుడు తీవ్రంగా విమ‌ర్శించారు. ఇప్పుడు మాత్రం మండ‌లి ర‌ద్దును చంద్ర‌బాబు నాయుడు వ్య‌తిరేకిస్తూ ఉన్నారు. తెలుగుదేశం నేత‌లు కూడా అదే మాటే మాట్లాడుతూ ఉన్నారు.

తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మండ‌లిని తొలి సారి ర‌ద్దు చేశారు. అయితే  ఇప్పుడు తెలుగుదేశం వాళ్లు మాత్రం మండ‌లి ర‌ద్దు స‌రికాద‌ని  అంటున్నారు. ఇలా ఎన్టీఆర్ ఆలోచ‌న‌ల‌ను తెలుగుదేశం నేత‌లు వ్య‌తిరేకిస్తున్న‌ట్టే. అలాగే చంద్ర‌బాబు నాయుడు కూడా మండ‌లి ఏర్పాటు అయిన‌ప్పుడు దాన్ని వ్య‌తిరేకించారు, ఇప్పుడు మండ‌లిర‌ద్దు అవుతుంటే దాన్నీ  వ్య‌తిరేకిస్తూ ఉన్నారు. ఇలా తెలుగుదేశం త‌న తీరును త‌నే వ్య‌తిరేకించుకుంటున్న‌ట్టుగా ఉంది!

   

Tags:    

Similar News