అచ్చెన్నపై అసూయపడుతున్న మంత్రులు

Update: 2015-12-20 07:37 GMT
ఏపీ మంత్రివర్గంలో కార్మిక మంత్రి అచ్చెన్నాయుడిని చూసి మిగతా మంత్రులంతాత అసూయపడుతున్నారట. చంద్రబాబు ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందని... శాసనసభ సమావేశాలు ఉంటే ఆయనకు మామూలప్పటి కంటే మరింత ప్రాధాన్యమిస్తున్నారని చెప్తున్నారు. దీంతో చాలామంది మంత్రులు అచ్చెన్నపట్ల కాస్త గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీలో దూకుడుగా ఉంటున్న విపక్షాన్ని అంతేస్థాయిలో ఎదుర్కోగలుగుతున్నది ఒక్క అచ్చెన్నమాత్రమేనని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే శాసనసభలో ఆయన్ను ముందుంచడానికి ప్రయత్నిస్తున్నారని సమచారం. ఆ క్రమంలో చంద్రబాబు తన శాఖలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతనూ అచ్చెన్నకే అప్పగిస్తుండడం విశేషం.

తాజాగా గురువారం నుంచి మూడు రోజుల పాటు జరిగిన సమావేశాల  సందర్బంగా అచ్చెన్నకు మరిన్ని బాధ్యతలు అప్పగించారు.  శాసనసభ సమావేశాల్లో అచ్చెన్న నిర్వహిస్తున్న కార్మిక - ఉపాధి - నైపుణ్య అభివృద్ధి   - క్రీడలు - యువజన వ్యవహరాలతో పాటు అదనంగా ఎనర్జీ - కోల్ - బాయిలర్స్ - సినిమాటోగ్రఫీ - పర్యాటక శాఖలను కూడా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆయనకు ఆదేశాలు అందాయి. ఇలా అదనంగా అప్పగించిన శాఖలన్ని ముఖ్యమంత్రి పరిధిలో ,పర్యవేక్షణలో ఉన్నాయి.ఆయా శాఖలకు సంబంధించి  అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు అచ్చెన్నియుడు వివరణ, వివరాలు అందించాల్పి ఉంటుంది. అచ్చెన్నాయుడు అసెంబ్లీ లో సమర్థంగా వ్యవహరిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇంతకుముందు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి నిర్వహించిన రాష్ట్రాల విద్యుత్ శాఖమంత్రుల సమావేశానికి కూడా అచ్చెన్నాయుడే హజరయ్యారు. ఆ శాఖ ఆయనది కానప్పటికీ ముఖ్యమంత్రి ఆయన్ను పంపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు అనేక సమస్యలను లేవనెత్తే అవాకాశం ఉండటంతో,వాటికి సమర్థంగా సమాధానాలు, సమాచారం ఇచ్చే సత్తా అచ్చేన్నాయుడుకి ఉందనే నమ్మకంతో ముఖ్యమంత్రి ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించారని తెలిసింది. చంద్రబాబు ఆయనపై విశ్వాసం ఉంచుతుంటే మిగతా మంత్రులు మాత్రం మూతిముడుచుకుంటున్నారట.
Tags:    

Similar News